Crime: ఊరి చివర రోడ్డు పక్కన రెండు ట్రాలీ బ్యాగులు.. ఓపెన్ చేసి చూస్తే ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు.. ఎవరా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2023-05-27T17:34:11+05:30 IST

తన కోపమే తన శుత్రువు అన్నారు పెద్దలు. అలాగే ఈర్ష్య కూడా ఎంత మాత్రం మంచిది కాదు. ఇది విషంలా పని చేస్తుంది అంటుంటారు. అంటే

Crime: ఊరి చివర రోడ్డు పక్కన రెండు ట్రాలీ బ్యాగులు.. ఓపెన్ చేసి చూస్తే ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు.. ఎవరా అని ఆరా తీస్తే..
Crime

పగ.. ఈర్ష్య.. కోపం అనేవి మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఈ లక్షణాలు మనిషి ఎదుగదలకు ఎంత మాత్రం క్షేమం కాదు. తన కోపమే తన శుత్రువు అన్నారు పెద్దలు. అలాగే ఈర్ష్య కూడా ఎంత మాత్రం మంచిది కాదు. ఇది విషంలా పని చేస్తుంది అంటుంటారు. అంటే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనిషి అన్నాక ఇవి లేకుండా ఉండవు గానీ.. ఏదొక సమయంలో ఇవి పుట్టుకొస్తాయి. వెంటనే ఈ గుణాలను అణిచివేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ.. ఆచరణలో పెడితే మాత్రం ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎన్నో అనార్థాలు మూటగట్టుకోవల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇద్దరి మధ్య జరిగిన పాత గొడవలు మనసులో పెట్టుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక వేశాడు. అంతే అందుకు తన ప్రియురాలిని పావుగా వాడుకున్నాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి అత్యంత దారుణంగా ప్రాణాలు తీసేశారు. కేరళలో (Kerala) తీవ్ర సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శుక్రవారం అట్టప్పడి (Attappadi) దగ్గర అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు (Two trolley bags recovered) ఖాకీల దృష్టికి వచ్చాయి. వాటిని తెరిచి చూడగా మనిషి శరీరానికి సంబంధించిన మాంసం ముక్కలు (body parts) కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో త్రిస్సూర్‌ చెరుతుర్తి దగ్గర ఓ హోండా సిటీ కారును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఆ కారుకు అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా లింకు ఉందేమోనన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారి అనుమానమే నిజమైంది. చివరకు ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ కేసు చిక్కుముడిని విప్పారు.

మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్‌ (58) ఐదేళ్ల క్రితం గల్ఫ్‌ దేశాల్లో పని చేసి తిరిగి వచ్చాడు. సిద్ధిఖ్‌ వ్యాపార నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా కోజికోడ్‌ జిల్లాలో వసతి ఏర్పాటు చేసుకున్నాడు. రంజిపాలెంలో ఓ హోటల్‌ నడుపుతూ పని చేసుకుంటున్నాడు. ఇదే హోటల్‌లో శిబిల్‌ (22) అనే యువకుడు మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే శిబిల్‌ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్‌ దృష్టికి వచ్చింది. దీంతో అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. ఈ పరిణామంతో శిబిల్‌ కోపంతో రగిలిపోయాడు. మరొకరితో కలిసి సిద్ధిఖ్‌ అంతు చూడాలని ప్లాన్ వేసుకున్నాడు. అందుకు తన ప్రియురాలైన ఫర్హానా(18)ను సాయం కోరాడు. అందుకు ఆమె కూడా సై అంది.

అనుకున్నట్టుగానే ఫర్హానా.. సిద్ధిఖ్‌ని ఫోన్‌‌ ద్వారా పరిచయం పెంచుకుంది. ఎలాగోలా అతడిని లోబర్చుకుంది. శారీరక సుఖం అందిస్తానని ఆఫర్ చేసింది. అందుకు అతడు సై అన్నారు. ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటల్‌కు రావాలని కోరింది. మే 18వ తేదీన హోటల్‌ దగ్గరకు సిద్ధిఖ్‌ చేరుకున్నాడు. ఆమె చెప్పిన గదిలోకి వెళ్లగానే అతన్ని.. శిబిల్‌, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేశారు. అనంతరం మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్‌ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి దగ్గర పడేసి వెళ్లిపోయారు.

lovek.jpg

తండ్రికి ఫోన్ చేసినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంగారు పడిన సిద్ధిఖ్‌ కొడుకు విదేశాల నుంచీ హుటాహుటిన కేరళకు చేరుకున్నాడు. నాలుగు రోజులు వెతికిన తర్వాత మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు (police team) చేపట్టారు. ఇలా జరుగుతుండగా.. సిద్ధిఖీ ఏటీఎం కార్డు నుంచి భారీగా నగదు డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్‌ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా నిందితులు శిబిల్‌, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. పగ ఎంత మాత్రం మంచిది కాదని చెప్పడానికి ఈ దుర్ఘటనే ఉదాహరణ. చేసిన తప్పుకు నిందితులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

Updated Date - 2023-05-27T17:37:18+05:30 IST