Pimples: క్రీములు, లోషన్లు అస్సలు అక్కర్లేదు.. రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టే చిట్కాలివి..!

ABN , First Publish Date - 2023-03-30T16:10:56+05:30 IST

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టేయొచ్చు. అదెలాగో ఇంట్లో అందుబాటులో ఉండే చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూసేద్దాం.

Pimples: క్రీములు, లోషన్లు అస్సలు అక్కర్లేదు.. రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టే చిట్కాలివి..!
Pimples

యుక్త వయసులోకి అడుగుపెట్టేటప్పుడు అమ్మాయిల్లో గానీ.. అబ్బాయిల్లో గానీ కొన్ని మార్పులు జరుగుతుంటాయి. శారీరక మార్పులు జరుగుతున్నప్పుడు ప్రధానంగా మొఖం మీద పింపుల్స్ రావడం జరుగుతుంటాయి. ఎక్కువగా బుగ్గలు మీద మొటిమలు వస్తుంటాయి. కొందరికైతే మొఖమంతా వచ్చేసి అందహీనంగా మారుతుంది. మరికొందరికైతే చేతులు, ఛాతీ, వీపు భాగాల్లో కూడా వస్తుంటాయి. దీంతో బయటకు రావాలన్నా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా నమోషిగా ఫీలవుతుంటారు. కొందరైతే మొఖం చూపించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఉంటుంది. ఇవి సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వస్తుంటాయి. కొందరికి నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. మరికొందరికైతే మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరికైతే గుంటలు, గుంటలుగా ఏర్పడతాయి. ఇవి తగ్గేందుకు చాలా సమయం పడుతుంటుంది. ఇందు కోసం వాడని క్రీములు ఉండవు. లోషన్లు ఉండవు. అవి తగ్గేంత వరకూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇరుగుపొరుగువాళ్లు చెప్పే ప్రతి సలహాను పాటిస్తూ నయం చేసుకునేందుకు తంటాలు పడుతుంటారు. అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టేయొచ్చు. అదెలాగో ఇంట్లో అందుబాటులో ఉండే చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూసేద్దాం.

చర్మంపై పొరలోని రంధ్రాలలో జిడ్డు పేరుకుపోయినప్పుడు వాటిలో బ్యాక్టీరియా చేరి ముఖం (face)పై మొటిమలు (Pimples) రావడం ప్రారంభమవుతాయి. చర్మాన్ని లూబ్రికేట్ చేయడానికి ఈ రంధ్రాల ద్వారా సెబేషియస్ ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఈ ద్రవం గడ్డకట్టి ఆగిపోతే అది మొటిమ రూపంలో చర్మం కింద గట్టి పడి మొటిమల రూపాన్ని తీసుకుంటుంది.

ఇక పింపుల్స్‌ను తొలగించేందుకు మార్కెట్లో అనేక క్రీములు, లోషన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ఉపయోగించడం వల్ల చాలా సార్లు తమ ముఖాలను పాడు చేసుకుంటున్నారు. దీంతో సమస్య మరింత ముదురుతోంది. ఇలాంటి కొత్త ఇబ్బందులు తెచ్చుకోకుండా వంటింట్లో ఉండే వీటితో ఈజీగా నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: Cooler: వాడకుండా పక్కన పడేసిన పాత కూలర్‌ను మళ్లీ బయటకు తీస్తున్నారా..? వాడే ముందు చేయాల్సిన పనులివీ..!

మొటిమలు తొలగించేందుకు టొమాటో రసం (Tomato juice) చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఓ గిన్నెలో రెండు చెంచాల టొమాటో రసం తీసుకుని అందులో ఒక చెంచా తేనె, అర చెంచా బేకింగ్ సోడా వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మొటిమల మీద అప్లై చేయాలి. ముఖం ఆరిన తర్వాత చల్లని పాలతో మర్దన చేస్తూ శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే నయం అవుతాయి.

ఇది కూడా చదవండి: Sperm Donor: అమ్మ బాబోయ్.. 550 మందికి తండ్రయ్యాడు.. ఇతడి గురించి నిజం తెలిసి ఓ మహిళ ఏం చేసిందంటే..

అంతేకాదు పసుపు కూడా మరో చక్కటి ఔషధం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పింపుల్స్‌ను నయం చేయడానికి బాగా పనిచేస్తుంది. దీన్ని మొదటిగా పేస్ట్‌గా తయారు చేయాలి. ఇందుకోసం పాలు, రోజ్ వాటర్‌లో ఒక చెంచా పసుపు పొడిని కలిపి పేస్ట్ చేసి మొఖం మీద అప్లై చేయాలి. ఇలా చేస్తే సులభంగా మచ్చలు తొలగిపోతాయి. ఇలా కొన్ని రోజులు కంటిన్యూగా మొఖం మీద రాస్తే మొటిమల సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

ఇది కూడా చదవండి: Facts About Peanuts: పల్లీ పకోడీలంటే ఇష్టమా..? వేయించుకుని ఉప్పు, కారం చల్లుకుని మరీ పల్లీలను తింటుంటారా..? ఈ నిజాలు తెలుసుకోండి..!

అలాగే కలబంద (Aloe vera) కూడా మరో చక్కటి ఔషధం. దీంతో కూడా మొటిమలను పోగొట్టుకోవచ్చు. మొటిమలు, మచ్చలపై కలబంద జెల్‌ను రాసి ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే ఆటోమేటిక్‌గా పింపుల్స్ నయమవుతాయి.

ఇది కూడా చదవండి: Raja Singh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదు

Updated Date - 2023-03-30T16:10:56+05:30 IST