Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

ABN , First Publish Date - 2023-02-10T17:30:51+05:30 IST

కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. ప్రాణాపాయం త్రుటిలో తప్పిపోతుంటుంది. సడన్‌గా చోటు చేసుకునే ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో..

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. ప్రాణాపాయం త్రుటిలో తప్పిపోతుంటుంది. సడన్‌గా చోటు చేసుకునే ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే క్రమంలో అనుమానం వస్తుంది. దీంతో పరుపు ఎత్తి చూడగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. కొన్నిసార్లు మనం ఊహించని ప్రదేశాల్లో ఊహించని జంతువులు (Animals), విష సర్పాలు (snakes) తదితరాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు (Unexpected accidents) జరిగితే.. మరికొన్ని సార్లు ప్రమాదాలు వెంట్రుకవాసిలో తప్పిపోతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి పడుకుందామని బెడ్‌రూమ్ (Bedroom) లోకి వెళ్తాడు. అయితే తీరా పడుకునే క్రమంలో అతడికి పరుపు కింద ఏదో అలికిడి అవుతున్నట్లు అనుమానం కలుగుతుంది.

Viral Video: అసలు మెట్రో రైల్లోకి వాటిని ఎలా తీసుకెళ్లారు..? కుర్రాళ్ల చేష్టలపై మండి పడుతున్న నెటిజన్లు..!

snake-on-bed.jpg

దీంతో పరుపు ఎత్తి చూడగా.. కిండ ఓ విష సర్పం (snake) పడుకుని ఉండడం చూసి షాక్ అవుతాడు. పరుపు ఎత్తగానే పైకి లేచిన పాము.. కాసేపటికి మంచం కిందకు వెళ్లిపోతుంది. దీంతో వామ్మో! అనుకుంటూ అతను బయటికి పరుగుల పెడతాడు. అనంతరం స్నేక్ క్యాచర్‌కి (Snake catcher) సమాచారం అందిస్తాడు. అక్కడికి చేరకున్న స్నేక్ క్యాచర్.. పామును చాకచక్యంగా పట్టుకుని వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: దేనికైనా టైమ్ రావాలంటే ఇదేనేమో.. పగ తీర్చుకునేందుకు ఓపిగ్గా ఎదురుచూసి చివరకు ఈ గాడిద ఏం చేసిందంటే..

Updated Date - 2023-02-10T17:30:59+05:30 IST