Share News

Oils for Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అసలు ఏఏ నూనెలను వాడితే ఈ సమస్య తగ్గిపోతుందంటే..!

ABN , First Publish Date - 2023-11-14T12:10:50+05:30 IST

జుట్టు రాలే సమస్య ఉన్నవారు హెయిర్ మసాజ్ పేరు వింటే భయపడుతుంటారు. కానీ సరైన నూనెలతో హెయిర్ మసాజ్ చేస్తే..

Oils for Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అసలు ఏఏ నూనెలను వాడితే ఈ సమస్య తగ్గిపోతుందంటే..!

ఇప్పట్లో జుట్టు రాలడమనే సమస్య అధికంగా ఉంది. దీన్ని నివారించడానికి షాంపూల నుండి సీరమ్ లు, హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్.. ఇలా బోలెడు ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే మార్కెట్లో లభ్యమయ్యే వాటిలో ఎక్కువ భాగం రసాయనాలతో కూడుకున్నవే ఉంటాయి. ఇవి వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. దీనికి పరిష్కారంగా హెయిర్ మసాజ్ సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు హెయిర్ మసాజ్ పేరు వింటే భయపడుతుంటారు. కానీ సరైన నూనెలతో హెయిర్ మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలే సమస్య మంత్రించినట్టు మాయమవుతుంది(oil massage for hair fall solution). ఏ నూనెలతో మసాజ్ చేస్తే జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరుగుతుందో తెలుసుకుంటే..

ఆముదం..(castor oil)

ఆముదం ఎక్కువగా చిన్న పిల్లల కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఆమ్లాలు, ప్రోటీన్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ, జుట్టు మందంగా ఒత్తుగా నల్లగా పెరగడంలోనూ ఆముదం మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. ఆముదంతో జుట్టు మూలాలను మసాజ్ చేస్తుంది. కొద్దిరోజుల్లోనే ఫలితం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Sugar: ఈ లక్షణాలు కనిపిస్తే.. చక్కెరను ఎక్కువగా తింటున్నట్టే లెక్క..!


బాదం నూనె..(almond oil)

ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతోమంచిదని, జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతారు. అయితే బాదం నూనెతో తరచుగా హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టు రాలడం ఆగుతుంది. బాదం నూనెలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని ఆపడం ద్వారా అవి తిరగి పెరిగేందుకు సహాయపడతాయి.

ఆలివ్ నూనె..(olive oil)

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీన్ని జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఆలివ్ నూనెతో తరచుగా జుట్టుకు మసాజ్ చేస్తుంటే జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడం ఆపుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాల కారణంగా చుండ్రు, జుట్టు జిడ్డుగా ఉండటం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

రోజ్మేరీ ఆయిల్..(rosemary oil)

రోజ్మేరీ జుట్టు పెరుగుదలకు సహాయపడే గొప్ప మూలిక. రోజ్మేరీ నూనెను ఉపయోగిస్తే మగవారిలో వచ్చే బట్టతల సైతం పరిష్కారమవుతుంది. రోజ్మేరీ నూనెను జుట్టు మూలాలనుండి మసాజ్ చేస్తే జుట్టు రాలడం ఆగిపోయి ఊహించని రీతిలో పెరుగుతుంది.

కొబ్బరి నూనె..(coconut oil)

కొబ్బరి నూనె తరచుగా ఎక్కువమంది జుట్టు సంరక్షణలో వినియోగించే నూనె. దీన్ని ఉపయోగించినా జుట్టు రాలడమనే సమస్య ఎందుకుందో చాలామందికి అర్థం కాదు. కొబ్బరినూనెను గోరువెచ్చ చేసి జుట్టు మూలాలకు పట్టేలా సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల తలలో రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!


Updated Date - 2023-11-14T12:10:51+05:30 IST