Share News

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-13T14:27:17+05:30 IST

మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయిన యజమాని. అనుమానంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూస్తే..

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

పట్టణాలు నగరాల్లో అద్దెకు ఇల్లు కావాలంటే అపార్మెంట్లే గతి. చాలామంది అపార్మెంట్ల యజమానులు నిరంతరం బిల్డింగ్ అంతా తిరుగుతూ అందరూ నీట్ గా ఉంచుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు. ఓ అపార్ట్మెంట్ యజమాని కూడా అదేవిధంగా బిల్డింగ్ అంతా చెక్ చేసుకుని తిరిగి మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయాడు. ఆ ఇంటి గురించి అతనికేదో డౌట్ కొట్టడంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూశాడు. తదనంతరం అతను షాక్ కు లోనయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

అస్సాం(Assam) రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అస్సాం రాష్ట్రం గౌహతి నగరంలో సిక్స్ మైల్ ప్రాంతంలో పుర్బాసా అపార్మెంట్స్ ఉంది. దీని యజమాని ఎప్పటిలా బిల్డింగ్ అంతా చెక్ చేసుకుని మెట్లు దిగుతూ ఉన్నట్టుండి ఆగిపోయాడు. మెట్లకు ఆనుకుని ఉన్న ఓ ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుండంటో అతనికేదో అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో నివాసం ఉండే వ్యక్తి కొన్ని రోజుల నుండి కనిపించకపోవడంతో అతనికి వెంటనే ఫోన్ చేశాడు. కానీ ఫోన్ లో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి కిటికీ తలుపులు బయటనుండి బలవంతంగా తోశాడు. లోపల నుండి ముందుకంటే ఎక్కువాగ దుర్వాసన గుప్పుమని కొట్టడంతో అతనికి కంగారు పుట్టింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సగం కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

ఇది కూడా చదవండి: Dry Fruits: డయాబెటిస్ ఉందా..? ఈ 8 డ్రైఫ్రూట్స్‌ ఎంత హెల్ప్ చేస్తాయంటే..!


ఆ అపార్మెంట్లో బొకాజెన్ కు చెందిన అంజు అనే మహిళ తన భాగస్వామి మోని ఖాన్ అనే వ్యక్తితో కలసి నివసిస్తోంది. అయితే అంజుకు, మోని ఖాన్ కు పెళ్లైందని వారు చెప్పుకున్నారని, వారిద్దరికీ అస్సలు పెళ్లి కాలేదని పోలీసుల విచారణలో బయటపడింది. సగం కుళ్లిపోయిన అంజు మృతదేహాన్ని గౌహతి మెడికల్ కాలేజ్ కు తరలించారు. మోని ఖాన్, అంజును హత్య చేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించగా అతని నెంబర్ పనిచేయకపోవడం ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోందని పోలీసులు వెల్లడించారు. అంజు కుటుంబ సభ్యులు కూడా మోని ఖాన్ మీద అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోని ఖాన్ ను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Marriage: సారీ.. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయను.. ఈ ఒక్క మాట చెప్పాక ఆ తల్లి ప్రాణాలతో లేదు.. అసలేం జరిగిందంటే..!


Updated Date - 2023-11-13T14:27:19+05:30 IST