Viral video: నీతా అంబానీ అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా..

ABN , First Publish Date - 2023-04-01T21:39:25+05:30 IST

ఆసియా అపర కుబేరుడు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆమె కొత్త కోణం ఇది...

Viral video: నీతా అంబానీ అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా..

ముంబై: ఆసియా అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita ambani) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాతృత్వ కార్యక్రమాలను స్వయంగా ముందుండి నడిపిస్తుంటారు. క్రీడా, కళల రంగాల్లోనూ చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుని ఎంకరేజ్ చేసే ఆమె... ఇటివలే ముగిసిన మహిళా ఐపీఎల్‌లో ఉమెన్స్ ముంబై ఇండియన్స్ జట్టుని ప్రత్యక్షం ప్రోత్సహించారు.

కాగా తాజాగా తన చిరకాల కోరికైన ఎన్ఎంఏసీసీని (Nita Mukesh Ambani Cultural Central) శుక్రవారం నాడు అంగరంగవైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇటు భారత్‌తోపాటు విదేశీ సినీ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‌లో నీతా అంబానీ స్వయంగా చేసిన నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. ‘రఘుపతి రాఘవ రాజా రామ్’ పాటకు ప్రత్యేకంగా నృత్య ప్రదర్శన చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఏకంగా ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. నీతా అంబానీలో అద్భుతమైన డ్యాన్సర్ ఉన్నారని ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. కాగా ఎన్ఎంఏసీసీ ప్రారంభ కార్యక్రమంలో షారుక్ ఖాన్, దీపకా పదుకొనే, సల్మాన్ ఖాన్ నుంచి రజనీ కాంత్‌తోపాటు చాలామంది ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-01T21:39:25+05:30 IST