Viral Video: ఈ బుడ్డోడి మనసు పెద్దది.. పక్షులకు నీరు అందించేందుకు ఎంత తపన పడుతున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-06-11T15:22:16+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయం అత్యంత విలువైనదిగా మారిపోయింది. ఎవరి కుటుంబం కోసం వారే సమయం కేటాయించుకోవడం కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో వేరే వ్యక్తుల గురించి ఆలోచించడం అనే ఊహ కూడా ఉండడం లేదు.

Viral Video: ఈ బుడ్డోడి మనసు పెద్దది.. పక్షులకు నీరు అందించేందుకు ఎంత తపన పడుతున్నాడో చూడండి..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయం అత్యంత విలువైనదిగా మారిపోయింది. ఎవరి కుటుంబం కోసం వారే సమయం కేటాయించుకోవడం కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో వేరే వ్యక్తుల గురించి ఆలోచించడం అనే ఊహ కూడా ఉండడం లేదు. అలాంటిది ఇతర జీవుల కష్టాల గురించి ఆలోచించడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. ఓ కుర్రాడు తాజాగా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చిన్న కుర్రాడు తన వాటర్ బాటిల్ ద్వారా ట్యాంకులో నీటిని (Water for Birds) పట్టి పక్షుల కోసం ఉద్దేశించిన చిన్న కుండను నింపుతున్నాడు. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పక్షుల పట్ల చిన్న పిల్లవాడి దయ, సానుభూతి సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. @Priyanka14081 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

WiFi: వైఫై పనిచేయడం లేదని ఓ సాఫ్ట్ వేర్ మహిళ చేసిన పనితో.. ఊహించని పరిణామం.. జరిగింది ఆలస్యంగా తెలిసి..!

ఈ వీడియోను ఇప్పటివరకు 53 వేల మంది వీక్షించారు. ఆ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పక్షులు నీటి కోసం విలవిలలాడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కర తమ ఇంటి దగ్గర చిన్న పాత్రలో నీరు వేసి ఉంచాలని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-11T15:22:16+05:30 IST