WiFi: వైఫై పనిచేయడం లేదని ఓ సాఫ్ట్ వేర్ మహిళ చేసిన పనితో.. ఊహించని పరిణామం.. జరిగింది ఆలస్యంగా తెలిసి..!
ABN , First Publish Date - 2023-06-10T20:40:20+05:30 IST
ఇటీవలి కాలంలో వాట్సాప్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. అమాయకుల వాట్సాప్ అకౌంట్లను కొందరు దుండగులు హ్యాక్ చేసి అందులో ఉన్న కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు చేసి డబ్బులు గుంజుతున్నారు.
ఇటీవలి కాలంలో వాట్సాప్ (WhatsApp) స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. అమాయకుల వాట్సాప్ అకౌంట్లను కొందరు దుండగులు హ్యాక్ చేసి (WhatsApp hacking) అందులో ఉన్న కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు చేసి డబ్బులు గుంజుతున్నారు. ఈ తరహా స్కామ్‌లు జరగకుండా ఆపడానికి ఏం చేయాలో తెలియక సైబర్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. రోజురోజుకు వాట్సాప్ స్కామ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కోల్‌కతా (Kolkata)కు చెందిన ఓ మహిళ ఈ వాట్సాప్ స్కామ్ (WhatsApp Scam)లో ఇరుక్కుంది.
గత వారం ఆమె ఇంట్లోని వై-ఫై (WiFi) పనిచేయడం మానేసింది. దీంతో ఆమె కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. రెండ్రోజుల తర్వాత సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి మొబైల్ ద్వారా 401 అనే కోడ్‌ను డయల్ చేయమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆ తర్వాత ఆమె వాట్సాప్ అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేశారు. ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టారు.
Viral News: సరిగ్గా ఏడాది క్రితం స్వీయ వివాహంతో వార్తల్లోకి ఎక్కిన ఈ యువతి.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..!
తాను ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రస్తుతం కోల్‌కతా వెళ్తున్నానని, తనకు కొంచెం డబ్బు అవసరం ఉందని, తాను చెప్పిన అకౌంట్ నెంబర్లో వీలైనంత వేయాలని ఆమె అడిగినట్టుగా అందరికీ మెసేజ్‌లు పంపించారు. బుధవారం ఉదయానికి ఆ మహిళకు అసలు విషయం తెలిసింది. తన వాట్సాప్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుసుకుని వెంటనే సైబర్ సెల్‌కు (Cyber Cell) ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు ప్రస్తుతం దర్యాఫ్తు చేస్తున్నారు.