Viral News: సరిగ్గా ఏడాది క్రితం స్వీయ వివాహంతో వార్తల్లోకి ఎక్కిన ఈ యువతి.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..!
ABN , First Publish Date - 2023-06-10T20:22:31+05:30 IST
కొంత మంది తీసుకునే విచిత్ర నిర్ణయాలు వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అచ్చం అలాంటి వ్యక్తే. ఈమె గతేడాది తనను తానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఒక్కత్తే హనీమూన్‌కు కూడా వెళ్లింది.
కొంత మంది తీసుకునే విచిత్ర నిర్ణయాలు వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. గుజరాత్ (Gujarat)కు చెందిన క్షమా బిందు (Kshama Bindu) అచ్చం అలాంటి వ్యక్తే. ఈమె గతేడాది తనను తానే పెళ్లి చేసుకుంది(Sologamy). ఆ తర్వాత ఆమె ఒక్కత్తే హనీమూన్‌కు కూడా వెళ్లింది. భారతదేశంలో స్వీయ వివాహం చేసుకున్న తొలి మహిళగా నిలిచింది. ఆమె తనను తాను వివాహం చేసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె తాజాగా ఘనంగా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని (Wedding Anniversary) సెలబ్రేట్ చేసుకుంది.
ఈ సందర్భంగా బిందు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో తన వైవాహిక జీవితంలోని కొన్ని మధుర క్షణాలను పొందుపరిచింది. తను ``ఏక్లా ఛలో రే`` అంటూ టాటూ వేయించుకుంటున్న సందర్భాన్ని కూడా బిందు ఆ వీడియోలో చూపించింది. ఏక్లా ఛలో రే అంటే ఒంటరిగా నడవడం అనే అర్థం. బిందు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది బిందుకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు చెబుతున్నారు.
Viral Video: ఇదేం పనయ్యా బాబూ.. చెట్టు కొమ్మపై కూర్చుని కత్తితో ఒకే ఒక్క వేటేశాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
గతేడాది జూన్‌లో 24 ఏళ్ల వయసులో బిందు తనను తాను వివాహం చేసుకుంది. సన్నిహితుల మధ్య తన ఇంట్లోనే స్వీయ వివాహం చేసుకుంది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి కూతురిలా తయారై తన నుదిటన తనే సిందూరం దిద్దుకుని, తను మెడలో తానే దండ వేసుకుంది. ఆ తర్వాత హనీమూన్‌కు వెళ్లింది. బిందు వివాహం గతేడాది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.