Nayanthara: అమ్మ బాబోయ్.. నయనతార మొత్తం ఆస్తుల విలువ అంతనా..!

ABN , First Publish Date - 2023-04-22T12:31:12+05:30 IST

దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్‌గా ఉన్న నయనతారకు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా ఉందని ఒక వార్త సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌ మీడియాలో..

Nayanthara: అమ్మ బాబోయ్.. నయనతార మొత్తం ఆస్తుల విలువ అంతనా..!

* నయనతార ఆస్తులు రూ.200 కోట్లా?

* చక్కర్లు కొడుతున్న వార్త

అడయార్‌(చెన్నై): దక్షిణాది చిత్రసీమలో (South Film Industry) అగ్ర హీరోయిన్‌గా ఉన్న నయనతారకు (Nayanthara) చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా ఉందని ఒక వార్త సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే, ఈ ప్రచారంపై నయనతార వర్గీయులు స్పందించడం లేదు. 2003లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ చిత్రాల్లో నటిస్తూ అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో అగ్రహీరోలందరి సరసన ఆమె నటించారు. దీంతో ఆమె ఒక్కో సినిమాకు రూ.కోట్లలోనే పారితోషికం తీసుకుంటున్నారు. పైగా తన సంపాదనను దర్శకుడు, తన భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి సినిమా నిర్మాణంలో పెట్టుబడిగా పెడుతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక నిర్మాణ సంస్థను నిర్మించి, సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో నయనతార ఆస్తులు రూ.200 కోట్లుగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

Updated Date - 2023-04-22T12:32:09+05:30 IST