Celebrities: ఎంఎస్. ధోనీ, అలియాభట్ సహా పలువురు సెలబ్రెటీలను సైతం వదలని సైబర్ కేటుగాళ్లు..ఏకంగా లక్షల్లోనే కొల్లగొట్టారు..!

ABN , First Publish Date - 2023-03-06T12:35:50+05:30 IST

రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఇంతవరకు సామాన్యులే ఎక్కువగా సైబర్ బాధితులని అనుకుంటే..

Celebrities: ఎంఎస్. ధోనీ, అలియాభట్ సహా పలువురు సెలబ్రెటీలను సైతం వదలని సైబర్ కేటుగాళ్లు..ఏకంగా లక్షల్లోనే కొల్లగొట్టారు..!

రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఇంతవరకు సామాన్యులే ఎక్కువగా సైబర్ బాధితులని అనుకుంటే.. తాజాగా సెలబ్రేటీలు కూడా వలలో చిక్కుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Former captain Mahendra Singh Dhoni), శిల్పాశెట్టి(Shilpa Shetty), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వంటి ప్రముఖుల పాన్ కార్డు వివరాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయడం.. కలకలం రేపుతోంది. టెక్నాలజీ(Technology) రోజుకో పుంత తొక్కుతున్న ప్రపంచంలో మనము బ్రతుకుతున్నాం. అదే సమయంలో టెక్నాలజీతో ఇబ్బంది పడుతున్నాం. ఇటీవల ఆన్‎లైన్ బ్యాంకింగ్(Online banking) మోసాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. సైబర్ నేరగాళ్లు (Cyber criminals)బ్యాంక్ ఖాతా లేదా పాన్‎కార్డు(PAN card) వివరాల ఆధారంగానూ..డబ్బును లూటీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో సెలబ్రెటీలు (Celebrities)కూడా చిక్కుకుంటున్నారు.

తాజా ఎంఎస్ ధోనీ(Dhoni), సోనం కపూర్(Sonam Kapoor), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), శిల్పాశెట్టి(Shilpa Shetty), సైఫ్ అలీఖాన్(Saif Ali Khan), అలియాబట్(Aliabutt), ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) సహా పలువురి ప్రముఖుల పాన్‎కార్డు(PAN card) వివరాలను దుర్వినియోగం చేశారు. వారి పాన్‎కార్డు (PAN card) వివరాల ఆధారంగా..సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) క్రెడిట్ కార్డులు(Credit cards)కూడా పొందారు. ఇక ఈ క్రెడిట్ కార్డులతో ఏకంగా రూ.50 లక్షలతో టోకరా వేశారు. ఆన్‎లైన్ నుంచి ఆ సెలబ్రెటీల జీఎస్టీ(GST) ఐడెంటిఫికేషన్(Identification) నెంబర్లను రాబట్టి.. ఫిన్ టెక్స్(fintech startup company) స్టార్టప్ కంపెనీ వన్ కార్డు(One Card) నుంచి క్రెడిట్ కార్డులు పొందిన కేటుగాళ్లు సరికొత్త మోసానికి పాల్పడ్డారు. అందుకే వారి వివరాలు ఎలా దొంగిలించారనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

ఆ వివరాల్లోకి వెళ్తే..ముందుగా..గుగూల్(Google) సెర్చ్ ద్వారా ఈ సెలబ్రెటీల(Celebrities) వివరాలను పొందారు.సెలబ్రెటీల పుట్టిన తేదీ వివరాలు గుగూల్‎లో లభ్యమవుతాయి. కనుక పుట్టిన తేదీ, పాన్ వివరాలు లభించడంతో..వాటి సహాయంతో కొత్త పాన్‎కార్డులకు వారి వారి ఫోటోలతో అప్లై చేశారు. ఆధార్ కార్డు వివరాలను కూడా ఇలానే రాబట్టారు. వీటితో వన్ కార్డు నుంచి క్రెడిట్ కార్డులు అప్లై చేశారు. ఇక వెరిఫికేషన్(Verification) సమయంలో బయటపడకుండా దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలో..రెండు నెలలకు పైగా పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. ఇక ఒక్కొ క్రెడిట్ కార్డుకు సుమారుగా రూ.10 లక్షల చొప్పున జారీ అయ్యాయి. ఇక లక్షల్లో లిమిట్(limit) ఉన్న కార్డుల నుంచి ఆ మొత్తాన్ని వారంలోనే వినియోగించారు. ఇంకా దానిని తిరిగి చెల్లించలేదు. ఓకే డివైస్(device) నుంచి దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో తమ సిస్టమ్ అలర్ట్ చేసినట్లు వన్ కార్డు పేర్కొంది. మొత్తంగా కేటుగాళ్లు.. 83 నకిలీ పాన్ కార్డు(Fake PAN card) వివరాలతో ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ తరహా సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‎ను చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన చోట మాత్రమే పాన్ కార్డు వినియోగించాలని, పాన్ కార్డు బదులు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్స్, ఆధార్ కార్డు వంటివి వాడితే మంచిదని అంటున్నారు.

Updated Date - 2023-03-06T13:28:09+05:30 IST