Viral Video: వామ్మో.. ఇదేం వింత టెక్నిక్.. లోపలికి దిగకుండానే మురికి పట్టి ఉన్న నీళ్ల డ్రమ్మును ఎలా క్లీన్ చేశాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-18T19:19:26+05:30 IST

మనం ఇంటిని తరచుగా శుభ్రం చేసుకుంటాం. అయితే నిత్యం ఉపయోగించే నీరు నిలువ ఉండే వాటర్ ట్యాంక్‌ను మాత్రం తరచుగా శుభ్రం చేయం.

Viral Video: వామ్మో.. ఇదేం వింత టెక్నిక్.. లోపలికి దిగకుండానే మురికి పట్టి ఉన్న నీళ్ల డ్రమ్మును ఎలా క్లీన్ చేశాడో మీరే చూడండి..!

మనం ఇంటిని తరచుగా శుభ్రం చేసుకుంటాం. అయితే నిత్యం ఉపయోగించే నీరు నిలువ ఉండే వాటర్ ట్యాంక్‌ను (Water Tank Cleaning) మాత్రం తరచుగా శుభ్రం చేయం. నెలకో, రెండు నెలలకో ట్యాంక్‌ను క్లీన్ చేయడం కూడా కొందరికి కష్టమే. ఎందుకంటే అది కాస్త కష్టంతో కూడుకున్నది. నీరు మొత్తం తీసేసి, ట్యాంక్‌లోకి దిగి శుభ్రం చేయాలంటే పెద్ద టాస్క్. దీంతో చాలా మంది వాటర్ ట్యాంక్ క్లీనింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే ఓ యూట్యూబ్ వీడియో (Youtube Videos) చూస్తే వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం అంత సులభమా? అనిపిస్తుంది.

ఆ వీడియోలో వ్యక్తి ట్యాంక్ నుంచి నీటిని తొలగించకుండా, లోపలికి దిగకుండా చాలా సులభంగా మురికిని క్లీన్ చేశాడు (Simple Tip). వాటర్ ట్యాంక్ క్లీనింగ్‌కు అతడు ఉపయోగించింది కేవలం ఒక ప్లాస్టిక్ బాటిల్, PVC పైపు, సాధారణ నీటి పైపు మాత్రమే. బాటిల్‌ను సగం వరకు కత్తిరించి, దానిని PVC పైపునకు బిగించాలి. ఆ పైప్‌ మరో చివరను వాటర్ పైప్‌నకు తగిలించాలి. ఆ తర్వాత సగం కత్తిరించిన బాటిల్‌లో నీరు పోసి ట్యాంక్ లోపలికి దించాలి. అలా చేయడం వల్ల ట్యాంక్ అడుగు భాగాన ఉన్న మురికి నీటితో పాటు బయటకు వచ్చేస్తోంది.

Simala Prasad: సినిమా హీరోయిన్‌లా కనిపించే ఈ ఐపీఎస్ ఆఫీసర్ రియల్ లైఫ్‌లో ఎన్ని ట్విస్టులో.. ఎలాంటి కోచింగూ తీసుకోకుండానే జాబ్ కొట్టి..

ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మంచి టెక్నిక్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంత ఈజీగా వాటర్ ట్యాంక్‌ను క్లీన్ చెయ్యొచ్చా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2023-03-18T19:20:31+05:30 IST