Simala Prasad: సినిమా హీరోయిన్‌లా కనిపించే ఈ ఐపీఎస్ ఆఫీసర్ రియల్ లైఫ్‌లో ఎన్ని ట్విస్టులో.. ఎలాంటి కోచింగూ తీసుకోకుండానే జాబ్ కొట్టి..

ABN , First Publish Date - 2023-03-18T19:06:34+05:30 IST

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిమల ప్రసాద్.. ఆమెను చూసి బాలీవుడ్ హీరోయిన్ అయ్యుంటుంది అనుకుంటున్నారా? మీ అంచనా కొంత వరకు నిజమే..

Simala Prasad: సినిమా హీరోయిన్‌లా కనిపించే ఈ ఐపీఎస్ ఆఫీసర్ రియల్ లైఫ్‌లో ఎన్ని ట్విస్టులో.. ఎలాంటి కోచింగూ తీసుకోకుండానే జాబ్ కొట్టి..

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిమల ప్రసాద్ (Simala Prasad).. ఆమెను చూసి బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ అయ్యుంటుంది అనుకుంటున్నారా? మీ అంచనా కొంత వరకు నిజమే.. ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. అలాగని ఆమె ఘనత అది కాదు.. ఆమె ఒక ఐపీఎస్ (IPS Officer) ఆఫీసర్. చిన్నప్పట్నుంచి సినిమాల పైనా, చదువు పైనా ఫోకస్ చేసి రెండింటిలోనూ సిమల ప్రసాద్ విజయవంతమయ్యారు. ఆమె విజయ గాథ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తోంది.

సిమల ప్రసాద్ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో 1980లో జన్మించారు. సిమల ప్రసాద్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో సిమల అనేక నాటకాలలో కూడా నటించింది. ఆమె తండ్రి డాక్టర్ భగీరథ్ ప్రసాద్, 1975 బ్యాచ్ IAS అధికారి. రెండు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు మధ్యప్రదేశ్‌లోని భింద్ నుంచి లోక్‌సభ సభ్యునిగా కూడా పని చేశారు. B.Com పూర్తి చేసిన సిమల సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పరీక్షలో టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. దీని తర్వాత సిమల మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి డీఎస్పీగా పోస్టింగ్ పొందారు.

Viral Video: తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో చూడండి.. ప్రమాదకర ఎలుగు బంటితో ఆటలు.. షాకవుతున్న నెటిజన్లు

ఉద్యోగం చేస్తూనే సిమల UPSC పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. సిమల ఏ ఉద్యోగ ప్రయత్నంలోనూ కోచింగ్ తీసుకోలేదు. స్వీయ ప్రతిభతోనే ఆమె విజయం సాధించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు జైఘం ఇమామ్.. సిమల ప్రసాద్‌ను చూసి ఆమెను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమావేశంలో, ఇమామ్ తన ``అలీఫ్`` సినిమా స్క్రిప్ట్‌ను సిమలకు వివరించారు. ఉద్యోగం చేస్తూనే సిమల ఆ సినిమాలో నటించారు. 2017లో ఆ సినిమా విడుదలైంది. దీని తర్వాత, 2019లో విడుదలైన ``నక్కష్`` చిత్రంలో కూడా సిమల నటించారు.

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? ఆ తల్లి చేసిన ఓ చిన్న పొరపాటే ఈ రెండేళ్ల బాలుడి మృతికి ఎలా కారణమయిందో తప్పక తెలుసుకోండి..!

Updated Date - 2023-03-18T19:06:34+05:30 IST