Viral Video: తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో చూడండి.. ప్రమాదకర ఎలుగు బంటితో ఆటలు.. షాకవుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-03-18T16:55:51+05:30 IST

తప్ప తాగిన వ్యక్తి ఏం చేస్తాడో ఎవరూ చెప్పలేరు. అమాయకుడైనా మద్యం మత్తు ఎక్కగానే గొప్ప వీరుడిలా ఫీలవుతాడు. ఒంటి మీద స్పృహ లేని పరిస్థితిలో ప్రమాదకర సాహసానికి దిగుతాడు.

Viral Video: తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో చూడండి.. ప్రమాదకర ఎలుగు బంటితో ఆటలు.. షాకవుతున్న నెటిజన్లు

తప్ప తాగిన వ్యక్తి (Drunken Man) ఏం చేస్తాడో ఎవరూ చెప్పలేరు. అమాయకుడైనా మద్యం మత్తు ఎక్కగానే గొప్ప వీరుడిలా ఫీలవుతాడు. ఒంటి మీద స్పృహ లేని పరిస్థితిలో ప్రమాదకర సాహసానికి దిగుతాడు. తాజాగా ఓ వ్యక్తి తాగిన మైకంలో ప్రమాదకర ఎలుగుబంటితో (Wild Bear) పెట్టుకున్నాడు. ఏకంగా దాని పైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్న ఒక వ్యక్తి ఫుల్‌గా తాగేసి మైకంలో ఉన్నాడు. తాగిన మత్తులో ఎలుగు బంటిపైకి ఎక్కి కూర్చున్నాడు. అతని చేతిలో మద్యం (Alchohol) సీసా, మరో చేతిలో మందు గ్లాస్ ఉన్నాయి. తప్పతాగి ఏం చేస్తున్నాడో మర్చిపోయినట్టుగా ఉన్నాడు. ఎలుగుబంటి పైకి ఎక్కి అటూ ఇటూ ఊగుతున్నాడు. ఆ ఎలుగుబంటి కోపంగా అరుస్తున్నట్టు ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థం అవుతోంది. ఈ ఘటన రష్యాలో (Russia) జరిగినట్టు తెలుస్తోంది.

దగ్గు మందు తాగి స్పృహ తప్పి పడిపోయిందంటూ 27 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తెచ్చిన భర్త.. ఆమె తాగింది ఏంటన్నది డాక్టర్లు చెప్పడంతో..

ఆ వ్యక్తి ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పి కింద పడినా అతడి పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 44 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.

అమ్మమ్మా.. ఆ ఆటో డ్రైవర్‌ను పిలవొద్దు.. వాడు మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 9 ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందని ఆ బామ్మ ఆరా తీస్తే..

Updated Date - 2023-03-18T16:55:51+05:30 IST