అమ్మమ్మా.. ఆ ఆటో డ్రైవర్‌ను పిలవొద్దు.. వాడు మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 9 ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందని ఆ బామ్మ ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2023-03-18T15:12:37+05:30 IST

పాపం.. ఆ బాలిక వయసు 9 ఏళ్లు.. ఆమె ఇంటికి సరుకులు తీసుకొచ్చే ఆటో డ్రైవర్ వయసు 47 ఏళ్లు.. కానీ, ఆ ఆటో డ్రైవర్ పేరు చెబితే చాలు ఆ బాలిక వణికిపోతోంది.. దయచేసి అతడిని ఇంటికి పిలవవద్దని వేడుకుంది..

అమ్మమ్మా.. ఆ ఆటో డ్రైవర్‌ను పిలవొద్దు.. వాడు మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 9 ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందని ఆ బామ్మ ఆరా తీస్తే..

పాపం.. ఆ బాలిక వయసు 9 ఏళ్లు.. ఆమె ఇంటికి సరుకులు తీసుకొచ్చే ఆటో డ్రైవర్ (Auto Driver) వయసు 47 ఏళ్లు.. కానీ, ఆ ఆటో డ్రైవర్ పేరు చెబితే చాలు ఆ బాలిక వణికిపోతోంది.. దయచేసి అతడిని ఇంటికి పిలవవద్దని వేడుకుంది.. ఏం జరిగిందని ఆరా తీసిన అమ్మమ్మకు షాకింగ్ విషయం తెలిసింది.. వెంటనే ఆ బామ్మ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆటోడ్రైవర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో ఈ ఘటన జరిగింది.

ఝోత్వారాకు చెందిన ఓ మహిళ ఓ మహిళ ఈ నెల 11వ తేదీన సరుకులు తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్లింది. ఆటోలోని వస్తువులను ఇంట్లో పెట్టేందుకు ఆటో డ్రైవర్ రాంధన్ సాన్సీ (47) లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 9 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ భాగాలపై చేతులు వేస్తూ, ముద్దులు పెడుతూ లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డాడు. ఏదైనా పని ఉంటే ఫోన్ చేయండి అని బయట ఉన్న బామ్మకు నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. గురువారం రాత్రి ఆ ఆటో డ్రైవర్‌కు బామ్మ ఫోన్ చేసింది. శుక్రవారం ఉదయం ఇంటికి రావాలని చెప్పింది. బామ్మ చెప్పింది విన్న మనవరాలు (Minor Girl) వణికిపోయింది.

Viral: ప్రియురాలి చేతిలో మోసపోయాడు.. డబ్బులు దక్కించుకున్నాడు.. అసలు కథేంటంటే..

``ఆ ఆటో డ్రైవర్ మంచోడు కాదు.. వేరే వ్యక్తిని పిలవండి`` అని బామ్మకు మనవరాలు చెప్పింది. దీంతో ఏమైందని బామ్మ ప్రేమగా అడగ్గా.. ఆ బాలిక తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మొత్తం చెప్పింది. శుక్రవారం ఉదయం ఆ బామ్మ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆటో డ్రైవర్ రాంధన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాంధన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని శుక్రవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

16 ఏళ్లుగా చేస్తున్న జాబ్‌కు గుడ్ బై.. రోడ్డు పక్కన టీ అమ్ముతూ జీవనం.. హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ నిర్ణయం అని అడిగితే..

Updated Date - 2023-03-18T15:12:37+05:30 IST