Viral: ప్రియురాలి చేతిలో మోసపోయాడు.. డబ్బులు దక్కించుకున్నాడు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2023-03-17T21:24:23+05:30 IST

ఇటీవలి కాలంలో యువతీయువకులు ప్రేమలో పడడం, బ్రేకప్ చెప్పేసుకుని విడిపోవడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రేమలో మోసపోయిన వ్యక్తి దేవదాసులా మారిపోయి..

Viral: ప్రియురాలి చేతిలో మోసపోయాడు.. డబ్బులు దక్కించుకున్నాడు.. అసలు కథేంటంటే..

ఇటీవలి కాలంలో యువతీయువకులు ప్రేమలో (Love) పడడం, బ్రేకప్ (Break-UP) చెప్పేసుకుని విడిపోవడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రేమలో మోసపోయిన వ్యక్తి దేవదాసులా మారిపోయి డిప్రెషన్‌కు వెళ్లిపోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. అలా జరగకుండా ఓ జంట ముందుగానే జాగ్రత్త పడింది. అందుకోసం వారు పెట్టుకున్న నిబంధన సోషల్ మీడియాలో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ నిబంధన పేరు ``హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్`` (Heartbreak Insurance Fund). దీని వెనుక కథేంటంటే..

@Prateek_Aaryan అనే వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. ప్రతీక్ కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రిలేషన్‌ను మొదలు పెట్టేటపుడే ప్రతీక్, అతని ప్రేయసి ఓ నిబంధన పెట్టుకున్నారు. ఆ నిబంధన ప్రకారం ప్రతి నెలా ఇద్దరూ కలిసి రూ.500 ఓ ఖాతాలో జమ చేయాలి. భవిష్యత్తులో ఎవరైతే మోసపోతారో వారికి ఆ డబ్బు మొత్తం దక్కాలి. దానికి ఆ జంట ``హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్`` అని పేరు పెట్టింది.

16 ఏళ్లుగా చేస్తున్న జాబ్‌కు గుడ్ బై.. రోడ్డు పక్కన టీ అమ్ముతూ జీవనం.. హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ నిర్ణయం అని అడిగితే..

ప్రతిక్ చెబుతున్న దాని ప్రకారం.. ఇటీవల ప్రతీక్‌ను అతడి ప్రేయసి మోసం చేసింది. ప్రతీక్‌కు బ్రేకప్ చెప్పేసి వేరే యువకుడికి క్లోజ్ అయింది. దాంతో అప్పటి వరకు వారిద్దరూ కలిసి దాచుకున్న మొత్తం రూ.25 వేలు ప్రతీక్‌కు దక్కాయి. ప్రతీక్ ఐడియా, అతను చేసిన ట్వీట్ (Viral Tweet) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ``నిజంగా చాలా గొప్ప ఐడియా`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పెళ్లి దుస్తుల్లో వెలిగిపోతున్న ఈ వరుడు.. కొద్ది గంటలకే పోలీస్ వ్యాన్‌లో ప్రత్యక్ష్యం.. ఇంతకీ ఈ పెళ్లికొడుకు చేసిన నిర్వాకమేంటంటే..

Updated Date - 2023-03-17T21:24:23+05:30 IST