పెళ్లి దుస్తుల్లో వెలిగిపోతున్న ఈ వరుడు.. కొద్ది గంటలకే పోలీస్ వ్యాన్‌లో ప్రత్యక్ష్యం.. ఇంతకీ ఈ పెళ్లికొడుకు చేసిన నిర్వాకమేంటంటే..

ABN , First Publish Date - 2023-03-17T19:26:02+05:30 IST

పాపం.. ఆ వరుడు ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా ఊరేగింపుతో కల్యాణ మండపానికి చేరుకున్నాడు..

పెళ్లి దుస్తుల్లో వెలిగిపోతున్న ఈ వరుడు.. కొద్ది గంటలకే పోలీస్ వ్యాన్‌లో ప్రత్యక్ష్యం.. ఇంతకీ ఈ పెళ్లికొడుకు చేసిన నిర్వాకమేంటంటే..

పాపం.. ఆ వరుడు (Groom) ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా ఊరేగింపుతో కల్యాణ మండపానికి చేరుకున్నాడు.. మరికొద్ది గంటల్లో తాళి కడతాడనగా ఊహించని షాక్ తగిలింది.. వధువు (Bride) ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడిని, అతడి తండ్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు.. వరుడి గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుని అందరూ నివ్వెరపోయారు.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఎటాహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది (Crime News).

ఎటాహ్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన కపిల్ కుమార్‌కు బులంద్‌షహర్‌కు చెందిన యువతితో పెళ్లి (Marriage) నిశ్చయమైంది. పెళ్లి రోజైన గురువారం ఉదయం కొత్వాలి నుంచి కపిల్ ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అతడికి పెళ్లికూతురు బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఆ తర్వాత కపిల్ గురించి వధువుకు షాకింగ్ విషయం తెలిసింది. వరుడికి ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని వధువుకు, బంధువులకు తెలిసింది. స్వయంగా కపిల్ భార్య సోదరుడు ఆ విషయాన్ని వధువకు చెప్పాడు.

Weird Laws: వామ్మో.. ఇవేం వింత చట్టాలు.. స్త్రీ, పురుషుల లోదుస్తులను కలిపి ఉతక్కూడదట.. భార్య బర్త్‌డేను మర్చిపోయిన భర్తకు శిక్ష ఏంటంటే..

తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. మొదటి వివాహాన్ని దాచి పెట్టి తనను మోసం (Cheating) చేశాడని తెలిపింది. పోలీసులు వెంటనే కల్యాణ మండపానికి చేరుకుని వరుడిని, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-03-17T19:26:02+05:30 IST