దగ్గు మందు తాగి స్పృహ తప్పి పడిపోయిందంటూ 27 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తెచ్చిన భర్త.. ఆమె తాగింది ఏంటన్నది డాక్టర్లు చెప్పడంతో..

ABN , First Publish Date - 2023-03-18T16:36:18+05:30 IST

ఆ మహిళ కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది.. భర్త దగ్గు మందు కొన్ని తెచ్చి ఇస్తే వేసుకుంటోంది.. ఎప్పటిలాగానే గురువారం సాయంత్రం కూడా దగ్గు మందు వేసుకుంది..

దగ్గు మందు తాగి స్పృహ తప్పి పడిపోయిందంటూ 27 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తెచ్చిన భర్త.. ఆమె తాగింది ఏంటన్నది డాక్టర్లు చెప్పడంతో..

ఆ మహిళ కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో (Cough) బాధపడుతోంది.. భర్త దగ్గు మందు కొన్ని తెచ్చి ఇస్తే వేసుకుంటోంది.. ఎప్పటిలాగానే గురువారం సాయంత్రం కూడా దగ్గు మందు (Cough Syrup) వేసుకుంది.. అయితే కొద్ది సేపటికే ఆమె ఆరోగ్యం విషమించింది.. రక్తపు వాంతులు చేసుకుంది.. నొప్పితో విలవిలలాడింది.. దీంతో భర్త వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.. ఆమె దగ్గు మందు అనుకుని పురుగుల మందు (Insecticide) తాగినట్టు బయటపెట్టారు.

రాజస్థాన్‌లోని (Rajasthan) ధోల్పూరా‌కు సమీపంలోని కైలాస్‌పూర్‌కు చెందిన ఇందిర (27) అనే మహిళ కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది. భర్త తెచ్చిన దగ్గు మందు వేసుకుంటోంది. గురువారం సాయంత్రం ఆమె దగ్గు మందుగా భావించి పురుగుల మందు వేసుకుంది. కొద్ది నిమిషాలకే ఆమె ఆరోగ్యం క్షీణించింది. రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వివాహిత మృతితో కుటుంబ సభ్యుల్లో కలకలం రేగింది. ఈ ఘటనపై బంధువులు పోలీసులకు సమాచారం అందించారు (Crime News).

అమ్మమ్మా.. ఆ ఆటో డ్రైవర్‌ను పిలవొద్దు.. వాడు మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 9 ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందని ఆ బామ్మ ఆరా తీస్తే..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరినీ శాంతింపచేశారు. పురుగుల మందు తాగినందు వల్లే ఇందిర చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే అల్లుడే తమ కూతురికి పురుగుల మంది ఇచ్చి చంపేశాడని ఇందిర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Bride: రెండ్రోజుల క్రితమే పెళ్లి.. నిద్ర వస్తోందంటూ గదిలోకి వెళ్లిన భార్య.. పనులన్నీ పూర్తయ్యాక అర్ధరాత్రి భర్త తలుపులు తీసి చూస్తే..

Updated Date - 2023-03-18T16:36:18+05:30 IST