Share News

Liver Damage: ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క.. నిద్ర పోయినప్పుడు ఇలా జరిగితే..!

ABN , First Publish Date - 2023-11-14T13:16:02+05:30 IST

రాత్రి సమయంలో కనిపించే ఈ లక్షణాలు కాలేయం దెబ్బతింటోందనడానికి సంకేతాలు.

Liver Damage: ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క.. నిద్ర పోయినప్పుడు ఇలా జరిగితే..!

శరీరంలో ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే కొన్ని అవయవాలు పాడైతే శరీరానికి చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి, ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి, వాటిని శరీరం మొత్తం సరఫరా చేయడానికి సహాయపడుతుంది. కాలేయం చెడిపోతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. రాత్రి సమయంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా కాలేయం దెబ్బతింటోందని అర్థం చేసుకోవచ్చు(liver damage signs at night). కాలేయం ఆరోగ్యాన్ని నిర్థారించే ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే..

దురదలు..(rashes)

రాత్రి సమయంలో నిద్రపోయేముందు శరీరమంతా లేదా కొన్ని ప్రాంతాలలో వివరీతమైన దురద ఏర్పడితే అది కాలేయం పాడవుతుందనడానికి సంకేతం. సాధారణంగా వాతావరణ మార్పుల కారణంగా కూడా ఇలా దురదలు రావడం జరుగుతుంది. ఈ కోణంలో తగు జాగ్రత్తలు తీసుకున్నా, దురదలు ప్రతిరోజూ ఇబ్బంది పెడుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: Sugar: ఈ లక్షణాలు కనిపిస్తే.. చక్కెరను ఎక్కువగా తింటున్నట్టే లెక్క..!


కలతనిద్ర..(Disturbed sleep)

చక్కని నిద్ర చక్కని ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కాలేయం ప్రమాదంలో ఉన్నట్టైతే నిద్రపోతున్న సమయంలో పదే పదే మెలకువ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం, వాతావరణం వల్ల నిద్రకు ఇబ్బందులు కలగడం సహజం. కానీ ఇలా పదే పదే నిద్రలో మెలకువ రావడం దీర్ఘకాలం కొనసాగితే దాన్ని కాలేయ సమస్యగా అనుమానించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యులను కలవడం మంచిది.

వాపు..(Swelling)

కాలేయ సమస్యలు ఉన్నట్టైతే చీలమండ, పాదం, కాలేయం చుట్టూ ఉన్న చర్మం మొదలైన ప్రాంతాలలో వాపు వస్తుంది. పగటి సమయంలో కంటే రాత్రి సమయంలో ఈ వాపు ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా ప్రాంతాలలో నొప్పి ఉంటుంది.

మూత్రం రంగు..(urine color)

మూత్రం రంగును చూసి శరీరంలో జబ్బులను నిర్ణయిస్తుంటారు. కాలేయం దెబ్బతినే అవకాశాలు ఉంటే మూత్రం రంగులో మార్పులు, మూత్రం దుర్వాసన రావడం వంటి సమస్యలుంటాయి. ఈ సమస్యను గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: Oils for Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అసలు ఏఏ నూనెలను వాడితే ఈ సమస్య తగ్గిపోతుందంటే..!


Updated Date - 2023-11-14T13:16:04+05:30 IST