Viral Video: పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ఎవరు వచ్చారో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

ABN , First Publish Date - 2023-03-19T15:25:22+05:30 IST

ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

Viral Video: పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ఎవరు వచ్చారో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

ప్రస్తుతం పాకిస్థాన్ (Pakistan) పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలకు తినడానికి తిండి దొరకడం లేదు. చేయడానికి పని దొరకడం లేదు. దీంతో చాలా మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు చూస్తున్నారు. మనుషులే కాదు.. జంతువులు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టున్నాయి. తాజాగా భారత్‌ సరిహద్దులో (India Border) సీసీటీవీకి చిక్కిన ఓ వీడియో (Viral Video) దానినే రుజువు చేస్తోంది.

భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన సాంబాలోని రామ్‌ఘర్ సబ్ సబ్ సెక్టార్ దగ్గర శనివారం రాత్రి 7 గంటలకు ఓ చిరుతపులి (Leopard) పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడింది. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఫెన్సింగ్ దాటి చిరుత లోపలికి రావడం ఆ వీడియోలో రికార్డు అయింది. పాకిస్థాన్ నుంచి చాలా నీరసంగా వచ్చిన చిరుత ఫెన్సింగ్ దాటి భారత్‌లోకి ప్రవేశించగానే చాలా ఉత్సాహంగా మారిపోయింది. పరుగులు పెడుతూ అడవిలోకి వెళ్లిపోయింది (Leopard entering into India from Pakistan).

Viral Video: చైనాలో ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా..? నెటిజన్ల ఆగ్రహం.. ఓ బాలిక మోకాళ్లపై కూర్చుని మరీ వేడుకున్నా కనికరం లేకుండా..

చిరుత రాకను సీసీటీవీ ద్వారా BSF జవాన్లు కనిపెట్టారు. సరిహద్దుకు దగ్గర్లోని గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నరు. ``ఆ చిరుత పాకిస్థాన్ ఏజెంట్`` అంటూ, ```అది చిరుత బాంబ్ ఏమో`` అంటూ, ``చివరకు జంతువులు కూడా పాకిస్థాన్‌లో ఉండాలనుకోవడం లేదు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇదేం వింత టెక్నిక్.. లోపలికి దిగకుండానే మురికి పట్టి ఉన్న నీళ్ల డ్రమ్మును ఎలా క్లీన్ చేశాడో మీరే చూడండి..!


Updated Date - 2023-03-19T15:25:22+05:30 IST