Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

ABN , First Publish Date - 2023-02-21T19:43:10+05:30 IST

బాలీవుడ్‌ క్వీన్‌, ఫైర్‌బ్రాంబ్‌ కంగనా రనౌత్‌ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ తీరుపై ఆమె కామెంట్‌ చేశారు.

Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ (kangana ranaut) మరోసారి నెపోటిజం (nepotism) టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Dadasaheb Phalke International Film Festival) తీరుపై ఆమె కామెంట్‌ చేశారు. ఆ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌(The Kashmir Files), ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ నటిగా ఆలియా భట్‌,(alia bhat) ఇతర కేటగిరీల్లో పలువురు బాలీవుడ్‌ తారలు అవార్డులు స్వీకరించారు. అవార్డు?ని స్వీకరించారు. ఆ అవార్డులు ఇవ్వడంలో కంగనా రనౌత్‌ అసహనం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘నిజంగా అర్హులైన వారికి అవార్డులు ఇస్తే ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కానీ సోమవారం జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డులు ఇవ్వడంతో మరోసారి నెపోటిజం బయటపడింది. నెపోటిజం వల్లే వారంతా అవార్డులు దక్కించుకున్నారు. అదొక పెద్ద బూటకం’’ అని కంగనా అన్నారు. అంతే కాదు వీలు కుదిరినప్పుడు ఆ అవార్డులకు ఎవరు అర్హులో చెబుతా అంటూ ప్రస్తుతానికి కొందరి పేర్లను చెప్పారు.

కంగనా పేర్కొన్న పేర్లివి... (kangana ranaut)

ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార)(Rishab shetty)

ఉత్తమ నటి: మృణాళ్‌ ఠాకూర్‌ (సీతారామం)(seetaramam)

ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)(RRR)

ఉత్తమ సహాయనటుడు: అనుపమ్‌ ఖేర్‌( ది కశ్మర్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయనటి: టబు (దృశ్యం 2) అంటూ ఈ పేర్లను ఆమె ప్రస్తావించారు.

అయితే పరోక్షంగా కంగనా కామెంట్‌ చేసింది రణబీర్‌, అలియాభట్‌ గురించే అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

ఈ విషయంలో కంగనను కొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు.

Updated Date - 2023-02-21T19:43:11+05:30 IST