Shankar: ‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్స్.. ప్రతినాయకుడిగా ప్రముఖ తెలుగు కమెడియన్..

ABN , First Publish Date - 2023-02-26T19:52:21+05:30 IST

ఇండియాలోని ఫేమస్ డైరెక్టర్స్‌లో శంకర్ (Shankar) ఒకరు. సందేశంతో కూడిన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఎవరు సాటిరారు. ‘ఇండియన్’, ‘రోబో’, ‘ఐ’, ‘2.o’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Shankar: ‘ఇండియన్ 2’ లో ఏడుగురు విలన్స్.. ప్రతినాయకుడిగా ప్రముఖ తెలుగు కమెడియన్..

ఇండియాలోని ఫేమస్ డైరెక్టర్స్‌లో శంకర్ (Shankar) ఒకరు. సందేశంతో కూడిన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఎవరు సాటిరారు. ‘ఇండియన్’, ‘రోబో’, ‘ఐ’, ‘2.o’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 2’ (Indian 2) కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఏడుగురు విలన్స్ నటిస్తున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. తెలుగుకు చెందిన ప్రముఖ కమెడియన్ కూడా విలన్ రోల్ చేస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం.

‘ఇండియన్ 2’ లో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్నారు. సముద్ర ఖని, బాబీ సింహా, జయప్రకాష్, గురు సోమసుందరం, మరిముత్తు, వెన్నెల కిషోర్ (Vennela Kishore), శివాజీ గురువాయూర్ ప్రతినాయక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని ఆదిత్య రామ్ స్టూడియోస్‌లో జరుగుతుంది. కమల్ చిత్రీకరణలో భాగంగా సినిమాలోని ఏడుగురు విలన్స్‌తో పోరాడుతున్నారు. ‘ఇండియన్ 2’ ను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, మనో బాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా మూవీని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక శంకర్ కెరీర్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ 15’ (RC15) అని వ్యవహరిస్తున్నారు. నెలలో 12రోజుల పాటు చరణ్ సినిమాను, మరో 12రోజులు ‘ఇండియన్ 2’ ను తెరకెక్కిస్తుండటంతో చిత్రీకరణలు కొంచెం ఆలస్యమవుతున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-26T19:53:07+05:30 IST