Inspector Death Mystery: డ్యూటీలో చేరిన వారానికే ఓ ఇన్‌స్పెక్టర్ హత్య.. 400 సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే వీడిన మర్డర్ మిస్టరీ..!
ABN , First Publish Date - 2023-11-20T14:38:09+05:30 IST
ఉద్యోగం వచ్చిన సంతోషంలో బంధువులను కలిసి సంతోషంగా గడిపాడు కానీ అంతలోనే..

ప్రభుత్వ కొలువు సాధించడమంటే అందరికీ సంతోషమే. ఓ వ్యక్తి కూడా ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షలలో నెగ్గి ఇన్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. ఉద్యోగంలో చేరిన వారం రోజుల తరువాత బంధువుల ఇంటికి కుటుంబంతో కలసి వెళ్ళి ఎంతో సంతోషంగా గడిపాడు. తిరిగి ఇంటికి వస్తోంటే దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఆ ఇన్ఫెక్టర్ హత్యకు గురయ్యాడు. అసలేం జరిగిందో అర్థం కాని పోలీసులు సుమారు 400 సీసీ కెమెరాల్లో చెక్ చేయగా షాకింగ్ నిజం బయటపడింది. ఈ మర్డర్ మిస్టరీ గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో పిఎసిలో సతీష్ సింగ్ అనే వ్యక్తి ఇన్పెక్టర్ గా నియమించబడ్డాడు. అతని భార్య పేరు భావన. ఉద్యోగంలో చేరిన 6రోజుల తరువాత సతీష్ తన భార్యతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ సంతోషంగా గడిపిన తరువాత రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వస్తోంటే ముసుగులో ఉన్న ఓ దుండగుడు సైకిల్ మీద వచ్చి సతీష్ మీద దాడి చేశాడు. అనంతరం అతను పారిపోయాడు. సతీష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఉద్యోగంలో చేరిన వారానికే ఇలా జరగడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ హత్య గురించి పోలీసులు సీరియస్ గా విచారణ మొదలు పెట్టడంతో కేసు మరో మలుపు తీసుకుంది.
ఇది కూడా చదవండి: Bank Holidays: 6 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలెర్ట్..!
హత్య జరిగిన ప్రాంతం నుండి 10కి.మీ ల దూరం మేర ఉన్న దాదాపు 400 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాలో ఓ వ్యక్తి సైకిల్ పై వచ్చి సతీష్ సింగ్ మీద దాడి చేయడం, అనంతరం సైకిల్ ను, దుస్తులను దారి మధ్యలో పారేయడం గమనించారు. ఆ హత్య చేసిన వ్యక్తి సతీష్ భార్య భావనకు స్వయానా సోదరుడే అనే విషయం తెలిసి షాకయ్యారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా ప్రశ్నించగా సతీష్ భార్య భావన సహకారంతోనే ఈ హత్య జరిగిందని ఆమె సోదరుడు పోలీసుల ముందు చెప్పాడు. సతీష్ కు చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అవన్నీ తెలిసి ఆమె తరచుగా బాధపడేదని భావన సోదరుడు ధర్మేంద్ర పోలీసులకు తెలిపాడు. తన సోదరి అలా బాధపడటం చూడలేక సతీష్ ను హత్య చెయ్యాలని అనుకున్నానని, పథకం ప్రకారం హత్య చేశానని అతను తెలిపాడు. ఈ కేసు గురించి విచారణ జరుగుతోంది.