Share News

Viral Video: ఫుట్‌పాత్‌పై పెట్టుకున్న టీషాపును తీసేస్తున్న పోలీసులపై.. మరుగుతున్న పాలను కుమ్మరించిన మహిళ..!

ABN , First Publish Date - 2023-11-20T13:36:34+05:30 IST

ఫుట్ పాత్ లపై ఆహారం విక్రయిస్తూ చాలా మంది ఉపాధి పొందుతుంటారు. ఓ మహిళ విషయంలో పోలీసులు చేసిన పనికి ఆమె ఎంత పని చేసిందంటే..

Viral Video: ఫుట్‌పాత్‌పై పెట్టుకున్న టీషాపును తీసేస్తున్న పోలీసులపై.. మరుగుతున్న పాలను కుమ్మరించిన మహిళ..!

రహదారుల మీదకు వెళ్లామంటే చాలు.. రోడ్డుకు ఇరువైపులా కాఫీ, టీ, టిఫిన్ అమ్ముతూ బోలెడు మంది కనిపిస్తారు. నిజానికి ఇలా టిఫిన్లు, టీలు అమ్ముతూ కుటుంబాలను పోషిస్తున్న చిరు వ్యాపారులు ఎక్కువే ఉన్నారు. వీరిలో మహిళలు, వృద్దులు, పిల్లలు అనే బేధం లేకుండా చాలామంది కష్టపడుతుంటారు. పాపం ఆ మహిళ కూడా అలా కష్టపడి ఆహారం అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేదే. కానీ పోలీసులు చేసిన పనికి ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలోనే వేడి వేడి పాలు పోలీసుల మీద కుమ్మరించింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కేరళ(Kerala)లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రం చెంగన్నూర్ నగరంలోని ఓ రహదారి ఫుట్ పాత్ పై ఓ మహిళ టీ, టిఫిన్ అమ్ముకుంటోంది. శనివారం మధ్యాహ్నం చెంగన్నూర్ హెల్త్ సూపరిడెంట్ , పోలీసులు, ఇతర మున్సిపాలిటీ అధికారులు అందరూ కలసి ఫుట్ పాత్ ను ఆక్రమించి ఏర్పాటు చేసిన టీ, టిఫిన్ షాపులను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా టీ, టిఫిన్ అమ్ముతున్న ఓ మహిళ దగ్గరకు చేరుకుని షాపును తొలగించమని డిమాండ్ చేశారు. అయితే ఆ మహిళ తనకు ఆ షాపే జీవితాన్ని ఇస్తోందని, తన కుటుంబానికి అదే ఆధారమని, షాపు తొలగించనని పోలీసులు, మున్సిపాలిటీ అధికారులకు చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాటిని తొలగింపజేయాల్సిన భాద్యత అధికారుల మీద ఉండటంతో అధికారులే ఆ షాపు తొలగించడంలో జోక్యం చేసుకోబోయారు. అయితే పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు షాపు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారని, దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనతో ఆ షాపు నడుపుతున్న మహిళ పరిధి మించి ప్రవర్తించింది. టీ కోసం వేడి చేసిన పాల గిన్నెను గుడ్డ సహాయంతో ఎత్తి అధికారుల మీద కుమ్మరించింది. అనంతరం చేతికి దొరికిన వస్తువులను వారి మీదకు విసిరింది.

ఇది కూాడా చదవండి: Dates: చలికాలంలో వీటిని తప్పకుండా ఎందుకు తినాలంటే..!


మహిళ అందరి మీద పాలు కుమ్మరించిన తరువాత అక్కడి పోలీసులు ఆమెను హెచ్చరిస్తూ షాప్ తొలగించడానికి ముందుకు వెళ్ళబోయారు. అయితే పొయ్యి మీద వేడి నూనె కూడా ఉందని ఎవరైనా దగ్గరకు వస్తే వేడి నూనె మీద పోస్తానని ఆమె బెదిరించింది. తమకు ఆ షాపు తప్ప వేరే ఆధారం లేదని తమను వదిలేయని కూడా ఆమె వారిని వేడుకుంది. ఈ సంఘటన జరుగుతున్నంత సేపు చెంగన్నూర్ రహదారిపై ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. సీపీఎం వీధి వ్యాపారుల సంఘం అక్కడకి చేరుకుని అధికారులను అడ్డగించడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం సంఘటనను మనోరమ న్యూస్(Manorama News) వారు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: 6 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలెర్ట్..!


Updated Date - 2023-11-20T13:36:36+05:30 IST