Viral Video: ఇన్‌స్టా రీల్స్ కోసం ఈ యువతి వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది..!

ABN , First Publish Date - 2023-02-17T13:01:21+05:30 IST

నేటి యువత సెల్ఫీలు, ఇన్‌స్టా రీల్స్ అంటూ వీడియో చిత్రీకరణల కోసం ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.

Viral Video: ఇన్‌స్టా రీల్స్ కోసం ఈ యువతి వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది..!

Viral Video: నేటి యువత సెల్ఫీలు, ఇన్‌స్టా రీల్స్ అంటూ వీడియో చిత్రీకరణల కోసం ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తాము పెట్టే రీల్స్, వీడియోలు వైరల్ కావాలి తద్వారా రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ వచ్చేయాలనే తాపత్రయంలో ఎంతటి రిస్క్‌కైనా వెనకాడడం లేదు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా. తాజాగా ఇదే కోవలో ఓ యువతి ఇన్‌స్టా రీల్స్ తీస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ యువతి ఏదో వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది. దాంతో ఇలాంటి రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నెటిజన్లు చూరకలు అంటిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు, ఒక యువతి కలిసి ఇన్‌స్టా రీల్స్ చిత్రీకరిస్తున్నారు. దానిలో భాగంగా వారిద్దరూ ఒక గోడపై నుంచి పక్కనే ఉన్నా మెట్లపై దూకారు. మొదట యువకుడు గోడ మీద నుంచి మెట్లపై దూకాడు. ఆ తర్వాత అతడిని అనుసరిస్తూ యువతి కూడా గోడపై నుంచి పక్కనే ఉన్న మెట్లపై దూకింది. అప్పటికే మెట్లు నీటితో తడిసి ఉండడంతో ఆమె కాలు స్కీడై కిందపడిపోయింది. అలా కిందపడి ఓ రెండుమూడు మెట్లపై నుంచి జారుకుంటూ కిందకి వెళ్లిపోయింది. ఆ సమయంలో మెట్లు కనుక తల వెనుక భాగంలో తగిలి ఉంటే.. అంతే సంగతులు. ఇక ఈ వీడియో కాస్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు వైరల్ కావడం కోసం ఇలా ప్రాణాలు పణంగా పెట్టొద్దని హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: టెర్రస్‌పై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-02-17T13:01:23+05:30 IST