radish ముల్లంగి తినేవారు ఆ రెండు కలిపి తింటే చాలా ప్రమాదం సుమా..
ABN , First Publish Date - 2023-02-24T13:07:34+05:30 IST
ఈ సీజన్ లో ముల్లంగి(radish) ఎక్కువగా దొరుకుతుంది. దీంతో వైరైటీ వంటకాలు తయారు చేయవచ్చు. ముల్లంగి పచ్చడి, పరోటాలు, సలాడ్..
ఈ సీజన్ లో ముల్లంగి(radish) ఎక్కువగా దొరుకుతుంది. దీంతో వైరైటీ వంటకాలు తయారు చేయవచ్చు. ముల్లంగి పచ్చడి, పరోటాలు, సలాడ్, ముఖ్యంగా సాంబార్ లో ముల్లంగి వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ముల్లంగిలో పోషకాలు(Nutrients) సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో ఎక్కువగా తినే కూరగాయాలలో కాకరకాయ(Kakarakaya) కూడా ఒకటి. ముల్లంగి, కాకరకాయ కాంబినేషన్ ఎప్పుడూ తినకూడదని గుర్తుంచుకోండి. ఈ రెండు కలిపి తింటే శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రిపూట ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఆరెంజ్ ను చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ రెండు కలిపి తింటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశముంది.
ఈ కాంబినేషన్ వల్ల కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. చాలా మంది కీర, ముల్లంగి కలిపి సల్లాడ్ లో తింటూ ఉంటారు. కానీ, కీర, ముల్లంగి కలిసి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కీరలో ఆస్కార్ బైట్ ఉంటుంది. ఇది విటమిన్ C ని గ్రహిస్తుంది. దీన్ని వల్ల ముల్లంగి విటమిన్ సీ ని గ్రహించదు. ముల్లంగిలో విటమిన్(Vitamin) లో A, B, C, ప్రోటిన్, క్యాలుష్యం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదీ జీర్ణక్రియ(digestion) గొప్ప కూరగాయ అని పిలుస్తారు. అయితే..ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. తింటే ఏమ్ జరుగుతుందో తెలుసుకుందాం.
ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వల్ల..గుండెల్లో మంట, యాసిడ్ రిఫిలెక్స్, కడుపు నొప్పి వస్తోంది. దొసకాయ, ముల్లంగిని కలిపి తినకూడదు. ఎందుకంటే దొసకాయలో ఉండే ఆస్కార్ బైట్(Oscar Bite)..విటమిన్ C ని పీల్చుకునేలా చేస్తోంది. ముల్లంగితో పాటు నారింజను తీసుకుంటే.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముల్లంగి, టీ కలయిక చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇదీ మలబద్ధకం, ఆమ్లత్వానికి దారి తీస్తోంది. ముల్లంగిని ఎక్కువ తింటే.. అది అధిక మూత్రానికి కారణమై.. ఎక్కువ సార్లు..మూత్ర విసర్జన చేయరావచ్చు. ఇదీ శరీరంలో డీహైడ్రేషన్(Dehydration)కు కారణమవుతుంది. ముల్లంగి బ్లడ్ షుగర్ ని తగ్గిస్తోంది. తక్కువ బీపీ సమస్య ఉన్నవారు. వీటిని తినకూడదు. ముల్లంగిని చేదుతో కలిపి తింటే..గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. పాలతో చేసిన వస్తువులను..ముల్లంగితో కలిపి తినకూడదు. ముల్లంగి తిన్న తర్వాత పాల పదార్థాలను తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.