ఆరేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భార్య ఫోన్ స్విచాఫ్.. ఇంట్లో కూడా లేకపోవడంతో ఆ భర్త ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-02-04T18:34:21+05:30 IST

వారికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏ సమస్యలూ లేని వీరి కుటుంబంలో ఇటీవల అనుకోని సమస్య వచ్చి పడింది. ఓ రోజు పని నిమిత్తం బయటికి వెళ్లిన భర్త.. భార్యకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుగా..

ఆరేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భార్య ఫోన్ స్విచాఫ్.. ఇంట్లో కూడా లేకపోవడంతో ఆ భర్త ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

వారికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏ సమస్యలూ లేని వీరి కుటుంబంలో ఇటీవల అనుకోని సమస్య వచ్చి పడింది. ఓ రోజు పని నిమిత్తం బయటికి వెళ్లిన భర్త.. భార్యకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుగా ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో కూడా లేకపోవడంతో మరింత కంగారుపడ్డాడు. చివరకు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...

హర్యానాలోని (Haryana) అంబాలా పరిధికి చెందిన గోపీ( పేరు మార్చాం)కి.. 2017లో ఓ యువతితో (young woman) వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరి ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఫిబ్రవరి 1న ఇతడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఉదయం పనికి వెళ్లిన అతడికి.. కొద్ది సేపటి తర్వాత భార్య (wife) ఫోన్ చేసింది. పుట్టింటికి వెళ్తున్నా.. అని చెప్పడంతో భర్త అంగీకరించలేదు. దీంతో ఆమె సడన్‌గా ఫోన్ కట్ చేసింది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అని వచ్చింది.

షాకింగ్ సీన్.. రెస్టారెంట్‌ ముందు టిఫిన్ తింటోందో యువతి.. 20వ అంతస్తు పైనుంచి కిందకు దూకేసిన టెకీ.. చివరకు..

ఇంటికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.20వేల నగదు (cash), బంగారు (Jewelry), వెండి నగలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే అక్కడకు కూడా రాలేదని చెప్పడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించాడు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. అయితే కొన్ని రోజులకు స్థానిక సంభాల్ఖ అనే గ్రామానికి చెందిన సునిల్ అనే వ్యక్తితో కలిసి పారిపోయినట్లు తెలిసింది. దీంతో వారి ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. తమ కొడుకు జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

భార్య డెలివరీ కోసమని ఆస్పత్రికి వెళ్తే ఇలా జరిగిందేంటి..? రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి..

Updated Date - 2023-02-04T18:34:47+05:30 IST