Share News

Home Making: వంటింట్లో ఇలాంటి పురుగులు కనిపిస్తున్నాయా..? ఈ 5 ట్రిక్స్‌లో దేన్ని వాడినా ఇవన్నీ మటాష్..!

ABN , First Publish Date - 2023-11-14T14:36:10+05:30 IST

చాలా ఇళ్లలో బియ్యం నుండి పప్పుల వరకు ప్రతి దానికి పురుగు పట్టేస్తుంటుంది. ఈ సింపుల్ టిప్స్ లో ఏ ఒక్కటి పాటించినా పురుగు అనేదే కనిపించదు.

Home Making: వంటింట్లో ఇలాంటి పురుగులు కనిపిస్తున్నాయా..? ఈ 5 ట్రిక్స్‌లో దేన్ని వాడినా ఇవన్నీ మటాష్..!

వంటిల్లు ఆహారపదార్థాలకు నెలవు. బియ్యం, కందిపప్పు, గోధుమలు, పంచదార, తృణధాన్యాలు, పప్పులు.. ఇలా ప్రతి ఒక్కటీ వంటగదిలోనే ఉంటాయి. ఇవి తాజాగా ఉన్నట్టైతే వండుకోవడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ చాలా ఇళ్లలో బియ్యం నుండి పప్పుల వరకు ప్రతి దానికి పురుగు పట్టేస్తుంటుంది. వీటిలో నల్లగా కొన్ని, తెల్లగా నులిపురుగుల్లా సాగుతూ మరికొన్ని ఉంటాయి. వందలాది రూపాయలు పోసి కొన్న దినుసులు ఇలా పాడవుతుంటే బాధగా ఉంటుంది. అయితే ఈ కింద చెప్పుకునే 5 రకాల ట్రిక్స్ లో ఏ ఒక్కటి ఫాలో అయినా పురుగు పట్టిందనే మాటే వినిపించదు(tips to avoid worms in grains and cereals). వంటిట్లో పురుగులను తరిమికొట్టే చిట్కాలేంటో చూస్తే..

బిర్యానీ ఆకు..(bay leaf)

బిర్యానీ ఆకు మసాలా వంటకాలలోనూ, బిర్యానీ తయారీ లోనూ తప్పకుండా వాడుతుంటారు. ఈ ఆకు ఆహారానికి సునవాసను, రుచిని పెంచుతుంది. అయితే ఇది పురుగులను తరిమికొట్టడంలో కూడా పనిచేస్తుంది. ధాన్యం, పప్పులు, గింజలు ఇతరత్రా డబ్బాలలో బిర్యానీ ఆకులను ఉంచితే పురుగు పట్టవు.

వేప ఆకులు..(neem leaves)

వేపాకులు సహజంగానే మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకులను ధాన్యం డబ్బాలలో ఉంచితే పురుగు పట్టవు. బియ్యం, పప్పులు, గోధుమలు ఇలా ఎందులో అయినా వేపాకులు ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: Oils for Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అసలు ఏఏ నూనెలను వాడితే ఈ సమస్య తగ్గిపోతుందంటే..!



వెల్లుల్లి..(garlic)

వెల్లుల్లి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇవి కీటకాలను, పురుగులను తరిమికొట్టడంలో కూడా దిట్ట. వెల్లుల్లిని పొట్టు తీయకుండా ధాన్యం, పప్పులు, తృణధాన్యాల డబ్బాలలో వేయాలి. ఇలా చేస్తే పురుగు పట్టవు.

లవంగాలు..(cloves)

చాలామంది ఇళ్లలో చీమలు, దోమలు తరిమికొట్టేందుకు లవంగాలు ఉపయోగిస్తుంటారు. అయితే లవంగాలను ధాన్యం డబ్బాలలో ఉంచితే పురుగులు పారిపోతాయి. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ కనిపించవు.

ఎండకు పెట్టడం..(sunlight)

కొన్ని ధాన్యం లేదా పప్పు దినుసులు, తృణధాన్యాలలో తేమ చేరినా కూడా పురుగు పడుతుంటాయి. ఎక్కువకాలం నిల్వచేసుకునే వాటిని అప్పుడప్పుడు మంచి ఎండలో శుభ్రమైన బట్టమీద పోసి ఆరబెట్టాలి. దీని వల్ల పురుగు పట్టడమనే సమస్య ఎదురుకాదు.

ఇది కూడా చదవండి: Liver Damage: ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క.. నిద్ర పోయినప్పుడు ఇలా జరిగితే..!


Updated Date - 2023-11-14T14:36:12+05:30 IST