Share News

Health Tips: బరువు తగ్గేందుకు కొత్త రూల్.. డైట్ పాటించకుండా.. జిమ్‌లో కసరత్తులు కూడా చేయకుండానే..!

ABN , First Publish Date - 2023-10-31T17:08:01+05:30 IST

ఈ ఒక్క రూల్ టోటల్ గా జీవితాన్నే మార్చేస్తుంది. ఎంత బరువు ఉన్నా సరే ఐస్ లా కరిగిపోతుంది.

Health Tips: బరువు తగ్గేందుకు కొత్త రూల్.. డైట్ పాటించకుండా.. జిమ్‌లో కసరత్తులు కూడా చేయకుండానే..!

భారతదేశం క్రమంగా అధికబరువు ఉన్న ప్రజల సామ్రాజ్యంగా మారుతోంది. గత పదేళ్ళలో అధికబరువు సమస్య మూడు రెట్లు పెరిగిందంటే ఈ సమస్య ఎంత వేగంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, బయటి ఆహారాలు ఎక్కువగా తినడం, మానసిక సమస్యల కారణంగా అధికబరువు పెరుగుతున్నారు. చాలామంది అధికబరవు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో డైటింగ్, జిమ్ లో కసరత్తులు చేయడం ముఖ్యమైనవి. ఇన్ని చేసినా బరువు తగ్గడం లేదని బాధపడేవారు ఉన్నారు. కానీ బరువు తగ్గడం చాలా ఈజీ అండీ బాబూ.. దీనికి చేయాల్సిందల్లా 9-1 రూల్ ఫాలో కావడమే(9-1 RULE FOR WEIGHT LOSS)

. అసలు 9-1 రూల్ ఏంటి? ఇది బరువు తగ్గడంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది తెలుసుకుంటే..

బరువు తగ్గడానికి చాలా మంది విస్తృతంగా ఫాలో అవుతున్న ఫిట్నెస్ రూల్ 9-1. ఇందులో 9ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రతిరోజూ ఫాలో అవ్వడం ద్వారా బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. 9సంఖ్యతో మొదలై 1తో ముగిసే ఈ ఫిట్నెస్ రూల్ లో ఒకో సంఖ్య ఒకో అలవాటును తెలుపుతుంది.

Health Tips: చలికాలంలో వచ్చే సమస్యే ఇది.. అరటిపండ్లతో ఇలా చేయండి చాలు.. కాళ్లకు పగుళ్లు ఉంటే మటాష్..!



9-1 రూల్ లో 9 సంఖ్య నడకను సూచిస్తుంది. అధికబరువు నుండి విముక్తి పొందాలని అనుకునేవారు ప్రతిరోజూ 9వేల అడుగులు నడవాలి(9000 steps walking). దీనికోసం స్టెప్ కౌంట్ ఉపయోగించాలి. కేలరీలను బర్న్ చేయడంలో ఇది శక్తివంతంగా ఉంటుంది.

9-1రూల్ లో 8 సంఖ్య ప్రతిరోజూ తీసుకోవాల్సిన నీటి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీరు(8glasses water) తప్పనిసరిగా తీసుకోవాలి.

9-1 రూల్ లో 7 సంఖ్య నిద్రను సూచిస్తుంది. ప్రతిరోజూ 7గంటల నిద్ర(7hours sleep) తప్పనిసరిగా ఉండాలి. మంచి నిద్ర ఉంటే రోజంతా తాజాగా అన్ని పనులు చురుగ్గా చేసుకోగలుగుతారు.

9-1 రూల్ లో 6 సంఖ్య ధ్యానం ను సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 6నిమిషాల సేపు ధ్యానం(6minutes meditation) చేయాలని ఈ రూల్ చెబుతుంది. ఇది మైండ్ ను రిఫ్రష్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

9-1 రూల్ లో 5 సంఖ్య రోజూ తినాల్సిన పండ్లను సూచిస్తుంది. ప్రతిరోజూ 5రకాల పండ్లను(5 types of fruits) తీసుకుంటే శరీరానికి పోషకాలతో పాటు విటమిన్లు, ఫైబర్ సమృద్దిగా అందుతుంది.

9-1 రూల్ లో 4 సంఖ్య విరామాలను సూచిస్తుంది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ 8 నుండి 10గంటల సేపు కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారు. అలాంటి వారు 8,9 గంటల మధ్యలో కనీసం 4సార్లు బ్రేక్(4 beaks in work) తీసుకోవాలి. ఇది శరీర కదలికలను ప్రోత్సహిస్తాయి.

9-1 రూల్ లో 3 వ సంఖ్య మూడు ఆరోగ్యకరమైన భోజనాలను సూచిస్తుంది(3 times eating). ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచే, రాత్రి డిన్నర్ తప్పనిసరిగా స్కిప్ చేయకుండా తీసుకోవాలి.

9-1 రూల్ లో 2వ సంఖ్య నిద్రకు రాత్రి భోజనానికి మధ్య ఉండాల్సిన గ్యాప్ ను సూచిస్తుంది(2 hours gap ). భోజనానికి, రాత్రి నిద్రకు మధ్య 2గంటల గ్యాప్ ఉన్నట్టైతే అది అధికబరువును ప్రోత్సహించదు.

9-1లో చివరి సంఖ్య 1. ఇది ప్రతి రోడూ జాగింగ్, రన్నింగ్ , స్కిప్పింగ్ వంటి ఫిజకల్ యాక్టివిటీస్ ను సూచిస్తుంది(physical activity). ప్రతిరోజూ వీటిలో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి.

White Hair: 30 ఏళ్లు రాకుండానే తెల్లజుట్టా..? మెడిసిన్స్.. క్రీములు అక్కర్లేదండోయ్.. దీన్ని బొడ్డులో పోసి మర్దన చేసుకుంటే..!


Updated Date - 2023-10-31T17:08:01+05:30 IST