Health Fact: కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2023-09-24T13:15:20+05:30 IST

వెండి పట్టీలు ధరిస్తే ఆరోగ్యానికి మంచిదని విని ఉంటారు. కానీ ఈ నిజాలు తెలిస్తే మాత్రం అవాక్కవుతారు..

Health Fact:  కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తుంటారా? వీటి  గురించి ఈ నిజాలు తెలిస్తే..

ఆడపిల్లలు కాళ్లకు పట్టీలు ధరించి ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మిదేవి తిరుగుతున్నట్టే ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ కాలం మారేకొద్దీ అమ్మాయిలు కాళ్లపట్టీలను పక్కకు పెట్టేశారు. కాళ్ళపట్టీలు ధరించడం అంటే అదేదో పల్లెటూరి అమ్మాయిల్లా చాదస్తంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. సిటీలలో ఉంటున్న అమ్మాయిలలో సగానికి పైగా కాళ్లకు పట్టీలు లేకుండానే కనిపిసిస్తారు. పాతకాలంలో మహిళలలే కాదు పురుషులు కూడా కాళ్ళకు వెండి కడియాలు ధరించేవారని, వాటి వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

లోహాలలో బంగారం, వెండి చాలా పవిత్రమైన లోహాలుగా పరిగణించబడతాయి. బంగారాన్ని శరీరం పై భాగం నుండి నడుము వరకు మాత్రమే ధరిస్తారు. వెండిని కాళ్లకు పట్టీలుగా(silver anklets) ధరిస్తారు. వెండి పట్టీలు ధరించినప్పుడు శరీరంలో ఏదైనా అనారోగ్యం చేరితే కాళ్ల పట్టీలు రంగు మారతాయి. మహిళలకు ఎక్కువగా చెమటలు పట్టినా, లేదా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా శరీరంలో సల్పర్ పరిమాణం పెరిగినా కాళ్ల పట్టీలు నల్లగా మారతాయి. కాళ్లలో పట్టీలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చర్మం నీలం రంగులోకి మారితే శరీరంలో సోడియం స్థాయి పెరిగిందని అర్థమట. అలాంటి సందర్బాలు ఎదురైనప్పుడు వెంటనే ఉప్పు తినడం మానేయమని ఆయుర్వేదం చెబుతోంది.

Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. ఈ మూడు కారణాల్లో ఏదో ఒక దాని వల్లే అసలు సమస్య..!



కాళ్ళకు పట్టీలు ధరించడం ఆక్యుప్రెషర్ వైద్యం లాంటిదని కూడా చెబుతున్నారు. ఎక్కువసేపు నిలబడి పనిచేసే మహిళల్లో కాళ్ల నొప్పుల నివారణకు కాళ్ల పట్టీలు సహాయపడతాయి. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చాలామంది వెండి గ్లాసులు, వెండి స్పూన్లు, కంచాలు వాడుతుంటారు. వీటిలో ఆహారం తీసుకోవడం, త్రాగడం వల్ల శరీరంలో ఎముకలు దృఢంగా మారతాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల వెండి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. జలుబు, దగ్గు సహా అనేక వైరస్, బ్యాక్టీరియా దాడుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక రుమటాయిడ్ అర్థరైటిస్ తో బాధపడే మహిళలకు వెండి పట్టీలు అద్బుతమైన ఫలితాలు ఇస్తాయి. దీని చికిత్సలో సిల్వర్ మైక్రో ఫార్టికల్స్ కూడా ఉపయోగిస్తారు. వెండి కీళ్ళలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వెండి పట్టీలు క్రమం తప్పకుండా ధరిస్తే నేటికాలంలో మహిళలు ఎదుర్కొంటున్న హార్మోన్ సమస్యలు పరిష్కారం అవుతాయి. గర్భసంచికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. యాంగ్జిటీ, మానసిక సమస్యలకు కూడా వెండి పట్టీలు ధరించడం ఎంతో సహాయపడుతుంది.

జ్యోతిష్యం ప్రకారం వెండి చంద్రుడు, శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. వెండి చలువ చేసే లోహం. దీన్ని పాదాలకు ధరించడం వల్ల భూమినుండి శక్తి శరీరంలోకి ప్రవహిస్తుంది. ఇది శరీర ఉష్ణ్రోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక కాళ్ల పట్టీల శబ్ధం గుడిలో గంటనుండి వెలువడే శబ్దంతో సారూప్యం కలిగి ఉంటుంది. ఈ శబ్ధం శరీరానికి ఒక వైబ్రేషన్ ను అందిస్తుంది. అలాగే ఇంట్లో కూడా పాజిటీవ్ వైబ్రేషన్ కలిగిస్తుంది.

Viral Video: మెట్రో రైల్లో పుషప్స్ తీస్తూ రెచ్చిపోయిన కుర్రాడు.. పక్కనే ఉన్న ఓ వ్యక్తిని ఒత్తిడి చేయడంతో ఏం జరిగిందంటే..


Updated Date - 2023-09-24T13:15:20+05:30 IST