Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. ఈ మూడు కారణాల్లో ఏదో ఒక దాని వల్లే అసలు సమస్య..!

ABN , First Publish Date - 2023-09-22T14:07:17+05:30 IST

తెలిసో తెలియకో ఏర్పరుచుకున్న కొన్ని అలవాట్లు కళ్ళకింద నల్లటి వలయాలకు కారణమవుతున్నాయి. అవేంటంటే..

Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. ఈ మూడు కారణాల్లో ఏదో ఒక దాని వల్లే అసలు సమస్య..!

కళ్లచుట్టూ నల్లని వలయాలు ఉండటం వల్ల ముఖ సౌందర్యం అంతా పాడైపోతుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం మహిళలలో మాత్రమే కాదు పురుషులలో కూడా ప్రధాన సమస్యగా మారింది. మహిళలు మేకప్, ఫ్యాన్సీ గ్లాసెస్, క్రీములు మొదలైనవి ఉపయోగించడం ద్వారా వీటిని కవర్ చేస్తుంటారు. పురుషులకు గ్లాసెస్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ నల్లని వలయాలను ఎప్పుడూ కవర్ చేయాలని చూడటం తప్ప వాటికి అసలు కారణం ఏంటి? ఏం చేస్తే అవి తగ్గుతాయి అనే విషయం మీద దృష్టిపెట్టేవారు తక్కువ. కానీ కళ్ల కింద నల్లటి వలయాలకు ఎవరికివారే బాధ్యులని వైద్యులు చెబుతున్నారు. తెలిసో తెలియకో ఏర్పరుచుకున్న కొన్ని అలవాట్లు కళ్ళకింద నల్లటి వలయాలకు కారణమవుతున్నాయి. అసలు అవేంటి? ఈ నల్లటి వలయాలను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..

కళ్ల కింద నల్లటి వలయాలకు మూడు ప్రధాన కారణాలు.. (3 reasons of dark circles)

కళ్లను పదే పదే రుద్దడం(eyes rubbing) చాలా మంది చేసే తప్పు. ఇలా కళ్ళను రుద్దడం వల్ల పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. దీని కారణంగానే కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి.

ధూమపానం(smoking), పొగాకు, గుట్కా లాంటివి వాడేవారు కళ్ళ కింద నల్లని వలయాలు కలిగి ఉంటారు. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను పెంచుతాయి. దీనికారణంగా నల్లనివలయాలు వస్తాయి.

కళ్లకింద మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ వంటివి రాయకుండా, కంటి సంరక్షణ తీసుకోకుండా(poor eye care) నిర్లక్ష్యం చేస్తే కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి.

పై మూడు కారణాలతో పాటు తగినంత నిద్రలేకపోవడం, ఒత్తిడి, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం, ఇన్సులిన్ నిరోధకత, బ్యూటీ ప్రోడక్ట్స్ అలెర్జీ, కళ్ళలో అలెర్జీ, సన్ స్క్రీన్ లేకుండా ఎండకు ఎక్కువగా వెళ్లడం మొదలైన కారణాల వల్ల కూడా కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయి.

Birth Control Pills: బర్త్ కంట్రోల్ పిల్స్‌ను వేసుకుంటే.. నిజంగా ముఖంపై మొటిమలు తగ్గిపోతాయా..? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..!



డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి ఏం చేయాలంటే..(dark circles reduce tips)

కళ్ళను పదే పదే రుద్దడం మానుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. బ్యూటీ ప్రోడక్స్ట్ వాడేవారు 6నెలలకు మించి గడువు ఉన్న సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించకూడదు.

ప్రతిరోజూ 6నుండి 8గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకోకూడదు. దుమ్ము, ధూళి అలెర్జీ ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా డిప్రెషన్ సమస్యను తద్వారా డార్క్ సర్కిల్స్ ను తగ్గించవచ్చు.

Fruit And Vegetable Peels: దానిమ్మ కాయల తొక్కలను పారేస్తున్నారా..? ఇది తెలిశాక మాత్రం ఆ పొరపాటు అస్సలు చేయరు..!


Updated Date - 2023-09-22T14:07:17+05:30 IST