Nightmares: కొందరికి భయంకరమైన పీడకలలు వస్తుంటాయి.. కానీ ఈ ఆహారం తింటే..!

ABN , First Publish Date - 2023-05-21T18:24:09+05:30 IST

పీడకలలు నిద్రను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఉలిక్కిపడి నిద్రలేవాల్సి వస్తుంది. అయితే చాలాసార్లు పడుకోబోయే ముందు ఒక గ్లాసు నీళ్ల తాగడం ద్వారా నియంత్రించవచ్చు. అంతే కాదు ఈ కింది ఆహారాన్ని తినడం ద్వారా...

Nightmares: కొందరికి భయంకరమైన పీడకలలు వస్తుంటాయి.. కానీ ఈ ఆహారం తింటే..!

నిద్రలో కలలు చాలా సాధారణ అంశం. అయితే కొందరు మాత్రం పీడకలల అనుభూతికి గురవుతుంటారు. బిల్డింగ్ మీద నుంచి పడిపోతున్నట్టు, దెయ్యాలు వెంటాడుతున్నట్టు, ఎక్కడో చిక్కుకుపోయి ఆపదలో పడినట్టు లేదా ఇష్టమైనవారు చనిపోయినట్టు.. ఇలా భయభ్రాంతులకు గురిచేసే కలలు వస్తుంటాయి. ఇలాంటి డ్రీమ్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇందుకు కారణాలు వేర్వేరుగా ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి, డిన్నర్‌లో కారం లేదా అధిక కొవ్వు కలిగిన పదార్థాలను ఆహారంగా తీసుకోవడం వలన కొన్నిసార్లు చెడు కలలకు (బ్యాడ్ డ్రీమ్స్) కారణమవుతుంటాయి. నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఇందుకు కారణమవ్వొచ్చు. కలలు నిద్రను డిస్ట్రర్బ్ చేస్తుంటాయి. ఉలిక్కిపడి నిద్రలేవాల్సి వస్తుంది. అయితే చాలాసార్లు పడుకోబోయే ముందు ఒక గ్లాసు నీళ్ల తాగడం ద్వారా నియంత్రించవచ్చు.

అయితే ఈ కింద పేర్కొన్న ఆహారాన్ని తినడం ద్వారా పీడకలలను వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అవేంటో చూద్దాం...

1. హెర్బల్ టీలు..

ఒక కప్పు చమోమిలే, వలేరియన్ లేదా లావెండర్ టీ తాగడం ద్వారా చక్కని ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట మంచిగా నిద్రపడుతుంది.

2. కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు..

శరీరంపై కాల్షియం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే పీడకలలు తగ్గే అవకాశాలు ఉంటాయి. పాలు, పెరుగు, జున్ను, పచ్చని ఆకులు కలిగిన పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

3. ట్రిప్టోఫాన్ కలిగివుండే ఆహారం

ట్రిప్టోఫాన్ అనేది అమైనో యాసిడ్. రిలాక్స్, చక్కటి నిద్రకు ఇది దోహదపడుతుంది. చేపలు, పౌల్ట్రీ, సముద్రపు ఆహారం, గుడ్లు, నట్స్, గింజలలో ఇది ఎక్కువగా ఉంటుంది.

4. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్...

నిద్రపోవడానికి ముందు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కలిగివున్న ఆహారం తీసుకుంటే బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడంలో సాయపడుతుంది. గోధుమతో తయారుచేసిన బ్రెడ్, బ్రౌన్ రైస్, చిలగడ దుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

5.విటమిన్ బీ6...

నిద్రను నియంత్రించడంలో భాగమైన న్యూరోట్రాన్స్‌మిటర్ ‘సెరోటోనిన్’ను ఆహారం ఉత్పత్తి చేయడంలో విటమిన్ బీ6 చాలా ముఖ్యమైనది. అరటి పండ్లు, నట్స్, పౌల్ట్రీ, చేపలు, తృణధాన్యాల్లో విటమిన్ బీ6 ఎక్కువగా లభ్యమవుతుంది.

Updated Date - 2023-05-21T18:25:18+05:30 IST