అమ్మాయికి ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయి నాకు ఈ పెళ్ళొద్దంటూ గొడవకు దిగిన వరుడు.. ఆరా తీస్తే బయటపడిన నిజం ఇదీ..

ABN , First Publish Date - 2023-03-14T11:16:39+05:30 IST

నిశ్చితార్థం జరిగిన మరుసటిరోజే అలా ఫోన్ రావడంతో..

అమ్మాయికి ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయి నాకు ఈ పెళ్ళొద్దంటూ  గొడవకు దిగిన వరుడు.. ఆరా తీస్తే బయటపడిన నిజం ఇదీ..

నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళి అయినట్టే అని చెబుతారు పెద్దలు. రెండు కుటుంబాల అంగీకారంతో ఆ జంటకు నిశ్చితార్థం(Engagement) జరిగిపోయింది. కానీ నిశ్చితార్థం జరిగిన మరుసటిరోజే పెళ్ళి రద్దుచేసుకుంటున్నామని అబ్బాయి కుటుంబం నుండి అమ్మాయి తండ్రికి ఫోన్ వచ్చింది . కారణమేంటని అడిగితే.. 'అమ్మాయికి ఇంటర్మీడియట్ లో మార్కులు తక్కువ వచ్చాయి ఇలాంటి అమ్మాయిని నేను పెళ్ళిచేసుకోను' అని వరుడు చెప్పాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసు విచారణలో వేరే నిజం బయటకొచ్చింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెలితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కన్నౌజ్(Kannauj) జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లా బాగన్వా గ్రామంలో రాంశంకర్ కుటుంబం నివసిస్తోంది. ఇతని కొడుకుకు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయితో పెళ్ళి కుదుర్చుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం రెండు కుటుంబాల సమక్షంలో జరిగింది. నిశ్చితార్థానికి సుమారు 60వేల రూపాయలు ఖర్చుచేశారు. 15వేల రూపాయల ఖరీదైన బంగారు ఉంగరం అబ్బాయికి పెట్టారు. నిశ్చితార్థం అయిపోయిన మరుసటిరోజు అబ్బాయి కుటుంబం నుండి అమ్మాయి తండ్రికి ఫోన్ వచ్చింది. 'అబ్బాయికి కట్నం ఎంతిస్తారు?' అని అబ్బాయి తరపు వారు అడిగారు. 'నిశ్చితార్థానికి ముందు కట్నం ఊసెత్తని మగపెళ్ళివారు, నిశ్చితార్థం అయిపోయాక ఇలా చేస్తున్నారేంటి?' అని అమ్మాయి కుటుంబం బాధపడింది. తాము కట్నం ఇచ్చుకోలేమని, ఆ విషయం ముందే చెప్పామని అమ్మాయి తండ్రి వారికి చెప్పాడు. అలా కుదరదు మాకు కట్నం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు అబ్బాయి కుటుంబ సభ్యులు. అమ్మాయి తండ్రి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పెళ్ళి రద్దు చేసుకుంటున్నామని చెప్పారు.

అమ్మాయి తండ్రి అబ్బాయి తరపు బంధువుల ద్వారా కూడా తన ప్రయత్నాలు చాలానే చేశారు. కానీ అబ్బాయి కుటుంబం ఏమాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అమ్మాయి తండ్రి పోలిస్ స్టేషన్ కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అబ్బాయి ఇంటికి చేరుకుని వారిని ప్రశ్నించగా.. 'అమ్మాయికి ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చాయి. నేను అలాంటి అమ్మాయిని ఎలా పెళ్ళిచేసుకోవాలి?' అని అబ్బాయి పోలీసులకు కొత్త కథ చెప్పాడు. దీంతో పోలీసులు రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కుదరని పక్షంలో అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతోంది.

Read also: నేను అత్తారింటికి వెళ్ళనని కార్లోంచి దిగిపోయిన నవవధువు.. వరుడికి ఆ సమస్య ఉందని అర్థమవడం వల్లే..


Updated Date - 2023-03-14T11:16:39+05:30 IST