Viral Video: ఫొటో కోసం ముద్దు పెట్టుకోమంటే నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయిన వధూవరులు.. ఫొటోగ్రాఫర్ పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-19T19:31:05+05:30 IST

జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన క్షణాన్ని కెమేరాలో భద్రపరచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ ఈవెంట్‌లో అయినా ఫొటోగ్రఫీ గురించే ముఖ్యంగా ఆలోచిస్తారు. ఇక, అతి ముఖ్యమైన వివాహ ఘట్టంలో అయితే ఫొటోగ్రాఫర్ లేకుండా ఏ కార్యక్రమమూ జరగదు.

Viral Video: ఫొటో కోసం ముద్దు పెట్టుకోమంటే నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయిన వధూవరులు.. ఫొటోగ్రాఫర్ పరిస్థితి ఏంటంటే..

జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన క్షణాన్ని కెమేరాలో (Camera) భద్రపరచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ ఈవెంట్‌లో అయినా ఫొటోగ్రఫీ గురించే ముఖ్యంగా ఆలోచిస్తారు. ఇక, అతి ముఖ్యమైన వివాహ ఘట్టంలో అయితే ఫొటోగ్రాఫర్ (Photographer) లేకుండా ఏ కార్యక్రమమూ జరగదు. ఇటీవలి కాలంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ అనేది సాధారణంగా మారిపోయింది. ఇటీవలి కాలంలో పెళ్లి సందర్భంగా తీసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే నవ్వు రాక తప్పదు.

yashofficialy20 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేదికపై వధూవరులు (Newly Wed Couple) ఉన్నారు. ఫొటోగ్రాఫర్ వధూవరుల ఫొటోలు తీస్తున్నాడు. ఆ సమయంలో ముద్దు పెట్టుకుంటున్నట్టు స్టిల్ ఇమ్మన్నాడు. దాంతో వధూవరులు లిప్‌లాక్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్ చెబుతున్నది పట్టించుకోకుండా ముద్దు పెట్టుకోవడంలో మునిగిపోయారు. వధూవరుల చర్య ఫోటోగ్రాఫర్‌ని షాక్‌కి గురిచేసింది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా ఇద్దరూ గాఢంగా కౌగిలించుకుని ముద్దును (Kiss) కొనసాగించారు.

Elephant Vs Tiger: పులి, ఏనుగు.. ఎవరు గొప్ప.. ఈ వీడియో చూస్తే బాస్ ఎవరో అర్థమవుతుంది!

కొద్ది సేపటి తర్వాత ఫొటోగ్రాఫర్ జోక్యం చేసుకోవడంతో కిస్సింగ్ సీన్‌కు తెరపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 29 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీ వీడియోలు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-06-19T19:31:05+05:30 IST