Elephant Vs Tiger: పులి, ఏనుగు.. ఎవరు గొప్ప.. ఈ వీడియో చూస్తే బాస్ ఎవరో అర్థమవుతుంది!

ABN , First Publish Date - 2023-06-19T16:50:26+05:30 IST

ఏనుగులు సాధు జంతువులు. సాత్వికాహారం తింటూ తమ పని తాము చేసుకుంటాయి. అనవసరంగా వేరే జంతువుల జోలికి వెళ్లవు. అయితే తమ జోలికి ఎవరైనా వచ్చినా, తమకు ప్రమాదం ఉందని తెలిసినా ఏనుగులు తమ సత్తా చూపిస్తాయి.

Elephant Vs Tiger: పులి, ఏనుగు.. ఎవరు గొప్ప.. ఈ వీడియో చూస్తే బాస్ ఎవరో అర్థమవుతుంది!

ఏనుగులు (Elephants) సాధు జంతువులు. సాత్వికాహారం తింటూ తమ పని తాము చేసుకుంటాయి. అనవసరంగా వేరే జంతువుల జోలికి వెళ్లవు. అయితే తమ జోలికి ఎవరైనా వచ్చినా, తమకు ప్రమాదం ఉందని తెలిసినా ఏనుగులు తమ సత్తా చూపిస్తాయి. ఇటీవలి కాలంలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ (Elephant videos) అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు, బెంగాల్ టైగర్ (Bengal Tiger) ముఖాముఖి ఎదురు పడ్డాయి.

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద ఏనుగు చెరువులో ఉంది. మరోవైపు నుంచి ఓ పెద్దపులి నెమ్మదిగా చెరువు వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. వెంటనే ఏనుగు అప్రమత్తమై పులి వైపు దృష్టి సారించింది. ఏనుగును ఇబ్బంది పెట్టకుండా తన దాహం తీర్చుకుని వెళ్లిపోవాలని పులి భావించింది. అయితే తనకు పులి వల్ల ప్రమాదం ఉంటుందని ఏనుగు భావించింది. దీంతో ఆ ఏనుగు పులి ఉన్న వైపు పరుగు ప్రారంభించింది (Tiger Videos).

Viral Video: మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇదే.. బాలికతో జింక ఎలా ప్రవర్తించిందో చూడండి..

ఏనుగు పరిగెత్తుకుంటూ రావడం చూసిన పులి అడవిలోకి పారిపోయింది (Elephant chases Bengal Tiger). అక్కడే ఉన్న కొందరు టూరిస్ట్‌లు ఆ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 51 వేల మంది ఆ వీడియోను చూశారు. అడవిలో ఏనుగు నిజమైన బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-19T16:50:26+05:30 IST