Viral Video: మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇదే.. బాలికతో జింక ఎలా ప్రవర్తించిందో చూడండి..

ABN , First Publish Date - 2023-06-19T16:17:06+05:30 IST

మనం ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తున్నామంటే.. ముందు మనం ఇతరులను గౌరవించాలనేది ప్రాథమిక సూత్రం. మనుషులతోనే కాదు.. జంతువులతో కూడా మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తే అవి కూడా మనతో అభిమానంగా ఉంటాయి.

Viral Video: మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇదే.. బాలికతో జింక ఎలా ప్రవర్తించిందో చూడండి..

మనం ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తున్నామంటే.. ముందు మనం ఇతరులను గౌరవించాలనేది ప్రాథమిక సూత్రం. మనుషులతోనే కాదు.. జంతువుల (Animals)తో కూడా మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తే అవి కూడా మనతో అభిమానంగా ఉంటాయి. ఆ విషయాన్ని రుజువు చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Viral Bhayani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కంచెకు ఒకవైపు ఓ చిన్న అమ్మాయి (Girl) ఉండగా.. అవతలి వైపు జింక (Deer) నిలబడి ఉంది. ఆ అమ్మాయి జింకను చూసి తల వంచింది. జింక కూడా ఆ అమ్మాయికి తల వంచి నమస్కరించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి జింక నోటికి ఆహారం అందించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకరికొకరు అభివందనం చేసుకున్నారు. ఆ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పాపం.. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాక మానవు.. కాళ్ల మీద పడినా కనికరించని కొడుకు, కోడలు, వైరల్ అవుతున్న వీడియో!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ వీడియో ఎంత అందంగా ఉంది``, ``జంతువులకు, చిన్న పిల్లలకు ఎలాంటి కల్మషమూ ఉండదు``, ``క్యూట్ వీడియో`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను జపాన్‌లో రూపొందించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-06-19T16:17:06+05:30 IST