Viral Video: పాపం.. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాక మానవు.. కాళ్ల మీద పడినా కనికరించని కొడుకు, కోడలు, వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-06-19T15:44:53+05:30 IST

ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాను ఎన్నో ఎమోషనల్ వీడియోలు ముంచెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ ఉన్నతికి కారణమైన తండ్రులను ఓసారి గుర్తు చేసుకున్నారు. అదే సందర్భంలో ఓ అమానవీయ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video: పాపం.. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాక మానవు.. కాళ్ల మీద పడినా కనికరించని కొడుకు, కోడలు, వైరల్ అవుతున్న వీడియో!

ఫాదర్స్ డే (Father`s day) సందర్భంగా సోషల్ మీడియాను ఎన్నో ఎమోషనల్ వీడియోలు ముంచెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ ఉన్నతికి కారణమైన తండ్రులను ఓసారి గుర్తు చేసుకున్నారు. అదే సందర్భంలో ఓ అమానవీయ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది. ఆ వీడియోలో ఓ కొడుకు తన తల్లిదండ్రుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది వ్యక్తులు వయసు మీరిన తమ తల్లిదండ్రులను ఇళ్ల నుంచి బయటకు పంపితే, మరికొందరు తమ వృద్ధ తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే చోటకు తమ భార్యతో కలిసి వెళ్లిపోతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కొడుకు తన వృద్ధ తల్లిదండ్రులను (Parents) వదిలేసి భార్యతో కలిసి వెళ్లిపోతున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోవద్దని ఆ కొడుకును తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అంతేకాదు కొడుకు కాళ్లపై కూడా పడ్డారు. అయినా ఆ కఠిన హృదయుడి మనసు కరగలేదు. సాష్టాంగపడినా ఆ కొడుకు జాలి చూపలేదు.

Crime: స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లడం ఆమె పొరపాటైంది.. చదువుకుందామని వెళితే ఎంత దారుణం జరిగిందంటే..

భార్యను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. yashofficialy20 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లిదండ్రుల పరిస్థితిపై జాలి పడుతున్నారు.

Updated Date - 2023-06-19T15:44:53+05:30 IST