Crime: స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లడం ఆమె పొరపాటైంది.. చదువుకుందామని వెళితే ఎంత దారుణం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-06-18T20:36:13+05:30 IST
ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.. చదువుకుంటున్న సమయంలో ఓ యువకుడితో స్నేహం చేసింది.. ఒకరోజు చదువుకుందామని చెప్పి ఆ యువతిని యువకుడు తన రూమ్‌కు పిలిచాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు..
ఆ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.. చదువుకుంటున్న సమయంలో ఓ యువకుడితో స్నేహం చేసింది.. ఒకరోజు చదువుకుందామని చెప్పి ఆ యువతిని యువకుడు తన రూమ్‌కు పిలిచాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. యువతి ప్రతిఘటించడంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.. దీంతో ఆ యువతి అతడిని నమ్మింది.. మరింత దగ్గరైంది.. ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకునేది లేదని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది (Crime News).
రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్‌కు చెందిన 24 ఏళ్ల బాధితురాలు చదువుకునే సమయంలో అత్యాచారానికి గురైంది. ఆమె క్లాస్‌మేట్ చేతిలో అత్యాచారానికి గురైంది. కంబైన్డ్ స్టడీస్ చేద్దామని చెప్పి యువతిని ఆ యువకుడు తన రూమ్‌కు పిలిచాడు. స్నేహితుడే కదా అని యువతి రూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువతి బెదిరించడంతో యువకుడు భయపడ్డాడు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడికి మరింత దగ్గరైంది.
Crime: తమ్ముడే కదా అని ఇంట్లో పెట్టుకున్నాడు.. నెల రోజుల్లోనే అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఎంతకు తెగించాడంటే..
పలుసార్లు అతడికి శారీరకంగా దగ్గరైంది. చదువు పూర్తై, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ యువకుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన బాధితురాలు పెళ్లి గురించి నిలదీసింది. దీంతో పెళ్లి చేసుకునేది లేదని యువకుడు తెగేసి చెప్పాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.