Gauri Khan: షారుఖ్ ఖాన్ భార్యపై కేసు.. ఆమె కారణంగానే అలా చేశానంటూ..

ABN , First Publish Date - 2023-03-02T14:51:05+05:30 IST

బాలీవుడ్‌ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌(Gauri Khan)పై కేసు నమోదైంది.

Gauri Khan: షారుఖ్ ఖాన్ భార్యపై కేసు.. ఆమె కారణంగానే అలా చేశానంటూ..

బాలీవుడ్‌ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌(Gauri Khan)పై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద ఎఫ్ఐఆర్ నమోదు (FIR Filed) చేశారు. ముంబైకి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యింది. ఈ కేసులో ఆమెతో పాటు తులసియని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ కంపెనీ సీఎండీ అనిల్ కుమార్ తులసియాని, ఆ సంస్థ డైరెక్టర్ మహేష్ తులసియాని ఉన్నారు.

Shahrukh.jpg

తులసియని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ కంపెనీకి గౌరీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ తన దగ్గర డబ్బులు తీసుకుని కూడా ఫ్లాట్‌ అప్పగించకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్‌ కోసం రూ.86 లక్షలు చెల్లించినట్లు, అయితే ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ వల్ల ప్రభావితమూ తాను ఆ కంపెనీకి సంబంధించిన ఫ్లాట్ కొన్నట్లు, అందుకే ఆమెపై కూడా కేసు పెడుతున్నట్లు జస్వంత్ ఫిర్యాదులో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-02T14:51:05+05:30 IST