Citadel: వెబ్‌సిరీస్ ట్రైలర్ వాయిదాకు కారణమిదే..!

ABN , First Publish Date - 2023-03-02T16:16:55+05:30 IST

రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్రలు పోషిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ (Citadel). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

Citadel: వెబ్‌సిరీస్ ట్రైలర్ వాయిదాకు కారణమిదే..!

రిచర్డ్ మ్యాడెన్ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్రలు పోషిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ (Citadel). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ షోలో రిచర్డ్, ప్రియాంక గూఢచారులుగా కనిపించనున్నారు. ప్రియంక కూడా తన ఫస్ట్ లుక్‌ను ఈ మధ్యనే సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు.

‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మార్చి 1న విడుదల చేస్తామని ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ, గ్రీస్‌లో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రైలర్‌ను విడుదలను వాయిదా వేశారు. ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘గ్రీస్‌లో చోటు చేసుకున్న బాధకరమైన ఘటనను తలచుకుంటూ ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం’’ అని ప్రైమ్ వీడియో తెలిపింది. కొత్త డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 28న రెండు ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారు. అనంతరం వచ్చే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తారు.

‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌ను ఇండియాలో రీమేక్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్ కీలక పాత్రలు పోషించారు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ షో షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-02T16:16:55+05:30 IST