Viral Video: వామ్మో.. ఇదేం జంతువు.. ఒక్క గుక్కలో లేడిని ఎలా మింగేసిందో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-03-19T16:46:28+05:30 IST

తన భారీ ఆకారంతో, రాక్షసత్వంలో ఇతర జంతువువలను వణికించిన డైనోసార్లు ఈ భూమి మీద నుంచి అంతరించి ఎన్నో ఏళ్లు అయిపోతోంది.

Viral Video: వామ్మో.. ఇదేం జంతువు.. ఒక్క గుక్కలో లేడిని ఎలా మింగేసిందో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

తన భారీ ఆకారంతో, రాక్షసత్వంలో ఇతర జంతువువలను వణికించిన డైనోసార్లు ఈ భూమి మీద నుంచి అంతరించి ఎన్నో ఏళ్లు అయిపోతోంది. అయితే కొమడో డ్రాగన్ (Komodo Dragon) అనే జంతువు భారీ ఆకారంతో ఇతర జంతువులనే కాదు.. మనుషులను కూడా భయపెడుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Video) చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించాల్సిందే. ఆ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు భయపడుతున్నారు (Shocking Videos).

animals_powers అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో కొమడో డ్రాగన్ అనే జంతువు ఓ జింకను (Deer) వేటాడుతోంది. పరుగులు పెట్టి దానిని పట్టుకుని బతికి ఉండగానే ఒక్కసారిగా దాన్ని మింగేసింది. ఆ వీడియో చూసిన వారు షాకవుతున్నారు. ఆ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది నిజమైన వీడియోనేనా.. అద్భుతంగా ఉంద``ని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు (Wild Animal Videos).

Viral Video: పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ఎవరు వచ్చారో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

ఈ కొమడో డ్రాగన్‌లు ఇండోనేషియాలోని (Indonesia) లెస్సర్ సుండా దీవుల్లో కనిపిస్తాయి. ఈ కొమోడో డ్రాగన్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద బల్లులు. ఇవి 10 అడుగుల (3 మీటర్లు) పొడవు, దాదాపు 100 కేజీల బరువు వరకు పెరుగుతాయి. అవి జింకలు, పందులే కాదు నీటి గేదెలను కూడా అమాంతం మింగేస్తాయి. తమ పదునైన దంతాలు, శక్తివంతమైన దవడలు, విషపూరిత లాలాజలంతో ఎంత పెద్ద జంతువునైనా వేటాడతాయి. ప్రస్తుతం ఈ కొమడో డ్రాగన్‌లు అంతరించి పోయే జంతువులు జాబితాలో ఉన్నాయి.

Delhi Crime: ఢిల్లీ నడిరోడ్డుపై క్రైమ్ సీన్.. యువతిని కొడుతూ వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్న యువకులు.. వీడియో వైరల్

Updated Date - 2023-03-19T16:46:28+05:30 IST