almond తినేటప్పుడు చేదుగా ఉంటుందా..? అసలు బాదం పప్పు తినవచ్చా..ఆరోగ్యానికి మంచిదేనా..?

ABN , First Publish Date - 2023-02-24T11:29:30+05:30 IST

ప్రతిరోజు కొన్ని బాదంపప్పులు(Almonds) తినడం వల్ల శరీర ఆరోగ్యానికి(Body health) ఎంతో మంచిది. ఇదీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు

almond తినేటప్పుడు చేదుగా ఉంటుందా..? అసలు బాదం పప్పు తినవచ్చా..ఆరోగ్యానికి మంచిదేనా..?

ప్రతిరోజు కొన్ని బాదంపప్పులు(Almonds) తినడం వల్ల శరీర ఆరోగ్యానికి(Body health) ఎంతో మంచిది. ఇదీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు మెదడు (brain) ఆరోగ్యానికి ఎంతో మంచిది. నానబెట్టిన బాదంపప్పులు తింటే..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇదీ రుచికి తియ్యగా ఉండటంతో.. ఎవరైనా వీటిని ఇష్టంగా తింటారు. కానీ మీరు ఎప్పుడైనా.. చేదు బాదంపప్పులు తిన్నారా..? అవును బాదం రుచి తియ్యగా, వగరుగా ఉంటుంది. కానీ చెదు బాదం ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. అయితే..చేదుగా ఉన్న బాదంపప్పు తినవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయాలను తెలుసుకుందాం..

రోజు బాదంపప్పు తింటే మంచిదంటారు. డైలీ నానబెట్టిన బాదంపప్పులు గుప్పెడు తింటే చాలు. గుండె పదిలం అంటారు. ఇంకా ఎన్నో లాభాలు బాదం పప్పు తింటే శరీరానికి సరైన పోషణ అందుతుంది. శక్తినివ్వడంతో పాటు మెదడుకు ఆరోగ్యాన్నిస్తుంది. ఈ బాదం పప్పులో బోలేడు రకాలు. మీరు ఎప్పుడైనా చేదు బాదం పప్పులు తిన్నారా..? పొరపాటున ఇలాంటివి కొంటే ఛీ.. మళ్లీ ఆ షాప్‎లో బాదం పప్పులు కొనకూడదు. చీ అన్నీ చెదే అనుకుంటాం. కానీ పడేదాం అంటే ఖరీదాయే..అలానే తింటాం. అయితే..చేదుగా ఉన్న బాదం పప్పు తినవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా.. అంటే కాదు అంటున్నారు నిపుణులు.

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటిన్, ఫైబర్, మెగ్నిషియం, మిటమిన్ ఈ, పాస్పరస్, రాగి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అంటారు. అంటే బాదం పప్పులో చెదు గింజలు కూడా ఉంటాయి. సాధారణవాటి మాదిరిగానే వాటిని పొలి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం చాలా కష్టం. తిన్న తర్వాత మాత్రమే వీటిని రుచిని బట్టి తెలుసుకోవచ్చు. మాములు బాదం మాదిరిగానే వాటిలో పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎక్కువగా ఉంటుందంటే.. అందులో కొద్దీ మొత్తంలో అమిక్ డాల్లిన్ ఉంటుంది. ఇదీ శరీరం తీసుకున్నప్పుడు సైనిడ్‎గా మారిపోతుంది. అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితమవుతుంది.

ఒక్కొసారి ఇవి ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చెదు తగిలితే వాటిని మింగకుండా బయటకు ఉమ్మివేయడం మంచిది. క్లినికల్ టాస్క్కాలజీ జనరల్‎లో(Clinical Toxicology General) ప్రచురించిన అధ్యయనం ప్రకారం 10 మందితో కూడిన బృందం పరిశోధనలు చేసింది. చేదు బాదం తీసుకోవడం వల్ల శరీరంలో సైనిడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తలతిరగడం, తలనొప్పి ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తంలో చేదు బాదం తీసుకుంటే.. ప్రాణాంతంకం అవుతుందని 2009లో జెన్నెలాఫ్ ఫుడ్ సైన్స్(Jenneloff Food Science) ప్రచురించిన వ్యాసంలో కూడా ఇదే వెల్లడించింది. చెదు బాదంలో సైనెడ్ వివిధ పరిమాణంలో ఉంటుందని వాటిని తీసుకోవడం నిజంగా హానికరమని అధ్యయనం చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-02-24T11:49:30+05:30 IST