World Richest Dog: ఈ శునకం వందల కోట్లకు యజమాని.. పాప్ స్టార్ మడోన్నా ఇంట్లో నివాసం.. మరెన్నో విలాసాలు దీని సొంతం!

ABN , First Publish Date - 2023-02-03T09:09:25+05:30 IST

సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగానే ఉంటాయనేది కాదనలేని వాస్తవం.

World Richest Dog: ఈ శునకం వందల కోట్లకు యజమాని.. పాప్ స్టార్ మడోన్నా ఇంట్లో నివాసం.. మరెన్నో విలాసాలు దీని సొంతం!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనుషుల కన్నా జంతువులకు విశ్వాసం, ప్రేమాభిమానాలు ఎక్కువగానే ఉంటాయనేది కాదనలేని వాస్తవం. వాటి పట్ల కొంచెం ఆదరణ చూపిస్తే చాలు జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. ఇక శునకాల్లో అయితే ఈ విశ్వాసం కూసింత ఎక్కువగానే ఉంటుంది. ఈ కోవకు చెందిన ఎన్నో సంఘటనల గురించి ఇప్పటికే మనం చాలాసార్లు విని ఉన్నాం. ప్రస్తుతం చాలామంది ఇళ్లలో కూడా పెంపుడు జంతువుగా శునకాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరు శునకాన్ని కుటుంబ సభ్యులతో సమానంగా కూడా చూసుకుంటారు. తమ పిల్లలకు చేసే బర్త్‌డేలు సైతం నిర్వహిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి తాను పెంచుకున్న కుక్కకు ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చాడు.

Sheperd.jpg

జర్మనీకి చెందిన కౌంటెన్ కార్లోటా లైబెన్‌స్టెయిన్ అనే కోటీశ్వరుడు ఇలా తన ఆస్తిని తాను పెంచుకున్న శునకం గుంథర్ VI (Gunther VI) పేరిట రాసిపెట్టాడు. లీబెస్టెయిన్ కుమారుడు గుంథర్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన జర్మన్ షెపర్డ్ (German Shepherds) జాతికి చెందిన ఓ శునకాన్ని పెంచుకున్నాడు. దానికి తన కుమారుడి పేరునే పెట్టి, ఎంతో మురిపెముగా చూసుకునేవాడు. ఈ క్రమంలో తనకు వారసులు లేకపోవడంతో ఆయన 1992లో చనిపోయే ముందు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, తనకు ఎంతో ఇష్టమైన గుంథర్ పేరు మీద 6.5 బిలియన్ డాలర్ల (రూ.655కోట్లు) ఆస్తి రాసిచ్చాడు. అంతే.. రాత్రికి రాత్రే ఈ కుక్క కోటీశ్వరురాలు అయిపోయింది.

Gunthers.jpg

ఇది కూడా చదవండి: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

ప్రస్తుతం ఈ శునకం పాప్ స్టార్ మడోన్నా మాజీ ఇంట్లో నివసిస్తుంది. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కుక్క జీవితంపై 'గుంథర్ మిలియన్స్' అనే డాక్యుమెంటరీ విడుదల కాబోతుంది. ఈ డాక్యుమెంటరీలో గుంథర్ VIకి సంబంధించిన అనేక షాకింగ్ సమాచారం ఉందట. ఇందులో కుక్క ఆస్తి కాకుండా అది ఈ ఆస్తిని ఎలా సంపాదించిందో కూడా వివరంగా ఉందట. దీనిపై డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్ ఆరేలియన్ లెటర్జీ సైతం గుంథర్ కథ తనకు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. ఒక శునకం ఇంత ధనవంతురాలి, ఇంత ఆర్భాటమైన జీవితాన్ని ఎలా గడుపుతుందో విని అందరూ ఆశ్చర్య పోతున్నారని ఆయన తెలిపారు. అందుకే ఈ కుక్క గురించి మరింత మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తీసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-02-03T09:37:01+05:30 IST