Meal Maker: మీల్ మేకర్‎ను ఎలా తయారు చేస్తారో తెలుసా..వీటిని ఎవరు తినకూడదు..ఎవరు తినాలి..?

ABN , First Publish Date - 2023-03-15T11:07:30+05:30 IST

మనము మీల్ మీకర్లను(Meal Makers) కూడా ఆహారంగా తీసుకుంటాం. వీటిలో రకరకాల కూరలు(curries) తయారు చేసుకుని తింటుంటాం. మీల్ మీకర్ తో చేసే కూరలు చాలా

Meal Maker: మీల్ మేకర్‎ను ఎలా తయారు చేస్తారో తెలుసా..వీటిని ఎవరు తినకూడదు..ఎవరు తినాలి..?

మనము మీల్ మేకర్స్‎ను(Meal Makers) కూడా ఆహారంగా తీసుకుంటాం. వీటిలో రకరకాల కూరలు(curries) తయారు చేసుకుని తింటుంటాం. మీల్ మేకర్‎తో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే.. చాలా మంది మీల్ మేకర్లపై చాల సందేహాలతో ఉన్నారు. మీల్ మేకర్లను అసలు తినవచ్చా..? ఇవి శాకాహారమా.. మాంసాహారమా..? వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయా లేదా..? ఇలా అనే రకాల సందేహాలను కలిగివున్నారు. మీల్ మేకర్లను అసలు ఎలా తయారు చేస్తారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? వీటిని ఎవరు తినకూడదు..ఏమైనా దృష్భవాలు ఉన్నాయా.. అన్న వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

మీల్ మేకర్లను సోయాగింజల నుంచి నూనే తీసిన తర్వాత.. మిగిలిన పింపిని ఉపయోగించి తయారు చేస్తారు. మీల్ మేకర్స్‎తో రుచికరమైన వంటకాలు చేయవచ్చు. మీల్ మేకర్లతో మసాల కూరలను, మంచురియాను తయారు చేస్తారు. అలాగే కిచిడీ, బిర్యానీ వంటి వాటిలో వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంద గ్రాముల మీల్ మీకర్లలో 52 గ్రాముల ప్రొటిన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్(Vitamins), మినరల్స్(minerals) ఉంటాయి. కొడిగుడ్లు(Eggs), మాంసం(meat)తో సమానమైన ప్రొటిన్(Protein) మీల్ మీకర్లలో ఉంటుంది. కండపుష్టి కోరకు వ్యాయామాలు చేసేవారు. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారం తినలేని వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. మీల్ మేకర్లను తరచూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. శరీరంలో పేరుపోయిన చెడు కొలస్ట్రాల్(Cholesterol) స్థాయిని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యం(heart health) మెరుగవుతుంది. అలాగే.. శరీరంలో అవయవాల చుట్టు పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

మీల్ మేకర్స్‎తో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కండపుష్టి కోసం వ్యాయామం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 25 నుంచి 35 గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని వీలైనంతవరకు ఇంట్లోనే వంట చేసుకుని తీనాలి. ఈ విధంగా మీల్ మేకర్‎ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల.. మనం చక్కని ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. శరీరంలో ఈస్ట్రోజన్(Estrogen) స్థాయిులు పెరుగుతాయి. మగవారు సాధ్యమైనంత తక్కువ తీసుకుంటే మంచింది. పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతి పరిమాణం పెరుగుతుంది.

ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, మలబద్ధకం, ఎక్కువసార్లు మూత్రానికి వేళ్లే సమస్య వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఉండే ప్రొటిన్ కారణంగా.. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. శరీరంలో నీరు ఎక్కువగా నిలిచి వాపులు రావడం, కడుపులో గ్యాస్, మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కొవాల్సివస్తుంది. అదే క్రమంలో శరీరంలో యూరిక్ యాసిడ్స్(Uric Acids) స్థాయిలు పెరుగుతాయి. రోజుకు 25 గ్రాముల మీల్ మేకర్స్ మాత్రమే తీసుకోవాలి.

Updated Date - 2023-03-15T11:20:45+05:30 IST