Brain Health: పగటిపూట కునుకేస్తే ప్రయోజనం ఉంటుందా?..పరిశోధనల్లో తేలిన అసలు నిజాలు ఇవే !

ABN , First Publish Date - 2023-06-22T17:04:27+05:30 IST

పగటిపూట కాసేపు కునుకు(Naps) తీస్తే చాలా తేలికగా ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని తరుచూ వింటుంటాం..పగటినిద్రకు, మెదడులో మార్పులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..అవేంటో తెలుసుకుందాం..

Brain Health: పగటిపూట కునుకేస్తే ప్రయోజనం ఉంటుందా?..పరిశోధనల్లో తేలిన అసలు నిజాలు ఇవే !

పగటిపూట కాసేపు కునుకు(Naps) తీస్తే చాలా తేలికగా ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని(Boost Your Brain) తరుచూ వింటుంటాం..ముఖ్యంగా నడివయస్కులు, వృద్ధుల ద్వారా ఇలాంటి మాటలు వినబడుతుంటాయి. అయితే పగటిపూట కునుకులో నిజంగా ప్రయోజనం ఉందా?.. ఉంటే మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? పగటి పూట అలా కాసేపు నిద్ర తీయగానే ఎందుకు మెదడు యాక్టివ్ పనిచేస్తుంది? పగటినిద్రకు, మెదడులో మార్పులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..అవేంటో తెలుసుకుందాం..

పగటి పూట చిన్నచిన్న నిద్రలతో మెదడు వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని ప్రముఖ జర్నల్ స్లీప్ హెల్త్‌లో(Sleep Health) ప్రచురించబడిన ఓ అధ్యయనంలో తేలింది. ఇటీవల లండన్ యూనివర్సిటీ(University College London), ఉరుగ్వే రిపబ్లిక్ యూనివర్సిటీ( University of the Republic in Uruguay) పరిశోధకులు పగటినిద్ర, మెదడు ప్రయోజనాలపై పరిశోధనలు చేశారు. పగటి పూట చిన్న నిద్ర మెదడు కుంచించుకుపోకుండా కాపాడుతుందని పరిశోధనలో తేలింది.

సాధారణగా..మెదడు సంకోచం అనేది వయస్సుతోపాటు వేగంగా పెరుగుతుంది. దీంతోపాటు జ్ఞాన సమస్యలు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులున్న వారిలో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. అయితే పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుంచించుకుపోవడం కొంతవరకు కాపాడుకోవచ్చని, క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల న్యూరోడెజెనరేషన్ నుంచి కొంతమేర రక్షించుకోవడం ద్వారా నిద్రలేమిని భర్తీ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

పగటిపూట నిద్ర అలవాటున్న వారిలో మెదడు పరిమాణం, జ్ఞానం,మెదడు ఆరోగ్యం, జన్యుపరమైన వైవిధ్యాలపై పరిశోధన చేశారు. పగటిపూట నిద్ర మొత్తం మెదడు పరిమాణం కలిగి పరిశోధనలో తేలింది.

ఇది చిన్న పగటిపూట నిద్రపోవడం మెదడు పరిమణం సంరక్షించడంలో సహాయపడుతుందని, మానసిక వైకల్య నివారణకు ఇది సానుకూల విషయం" అని అధ్యయనం రచయిత డాక్టర్ విక్టోరియా గార్ఫీల్డ్ అన్నారు.

Updated Date - 2023-06-22T17:07:09+05:30 IST