KBC 15: కేబీసీలో మరోసారి క్రికెట్‌పై ప్రశ్న.. సరైన సమాధానానికి ఈసారి ఏకంగా రూ.25 లక్షలు..!

ABN , First Publish Date - 2023-08-25T13:51:43+05:30 IST

హిందీలో ప్రసారమయ్యే 'కౌన్ బనేగా కరోర్‌పతి' (Kaun Banega Crorepati) ఇప్పటివరకు విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది 15వ సీజన్‌లో అడుగు పెట్టింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా కేబీసీ (KBC) 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

KBC 15: కేబీసీలో మరోసారి క్రికెట్‌పై ప్రశ్న.. సరైన సమాధానానికి ఈసారి ఏకంగా రూ.25 లక్షలు..!

ఇంటర్నెట్ డెస్క్: హిందీలో ప్రసారమయ్యే 'కౌన్ బనేగా కరోర్‌పతి' (Kaun Banega Crorepati) ఇప్పటివరకు విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది 15వ సీజన్‌లో అడుగు పెట్టింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా కేబీసీ (KBC) 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌‌లో పాల్గొన్న పలువురు సామాన్యులు రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారారు. ఇందులో పాల్గొనేవారికి వివిధ సామాజిక, ఇతర అంశాలపై బిగ్‌బీ ప్రశ్నలు సంధిస్తుంటారు. వాటికి సరైన సమాధానాలు చెబితే.. మనం ఎంతోకొంత ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇటీవల అబితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) సైతం గెస్ట్‌గా ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయనకి ఐపీఎల్‌ (IPL) పై ఓ ప్రశ్న ఎదురైంది. రూ.6,40,000 విలువ చేసే ఆ క్వశ్చన్ ఏంటంటే.. '2023 ఐపీఎల్‌లోని ఒక మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఎవరు?'. దీనికి ఆప్షన్స్‌గా ఏ. ఆండ్ర్యూ రస్సెల్, బీ. నీతిష్ రాణా, సీ. రింకూ సింగ్, డీ. వెంకటేష్ అయ్యర్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం.. రింకూ సింగ్ (Rinku Singh). గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 28 పరుగులు కావాల్సి ఉండగా రింకూ వీరవిహారం చేశాడు. దాంతో కేకేఆర్ సునాయాస విక్టరీని నమోదు చేసింది. ఇక తాజాగా మరోసారి ఓ పార్టిసిపెంట్‌కు క్రికెట్ సంబంధిత ప్రశ్న వేశారు. అది కూడా ఇటీవల కరేబియన్ జట్టుతో టీమిండియా ఆడిన 2 మ్యాచుల టెస్టు సిరీస్‌కు సంబంధించినది.

ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే.. 'టెస్టు క్రికెట్‌లో తండ్రి, కొడుకును ఔట్ చేసిన భారత తొలి క్రికెటర్ ఎవరు?'. ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌ వచ్చేసి A. రవీంద్ర జడేజా, B. రవిచంద్రన్ అశ్వీన్, C. ఇషాంత్ శర్మ, D. మహమ్మద్ షమీ అని ఇచ్చారు. క్రికెట్ చూసేవారైతే చాలా సులువుగానే దీనికి సమాధానం చెప్పేయొచ్చు. దీనికి సరియైన జవాబు: రవిచంద్రన్ అశ్వీన్ (Ravichandran Ashwin). వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ చంద్రపాల్, ఆయన కుమారుడు తగెనరైన్ చంద్రపాల్‌ (Tagenarine Chanderpaul) ను పెవిలియన్‌కు పంపి అశ్వీన్ ఈ రికార్డు నమోదు చేశాడు. అంతకుముందు చంద్రపాల్‌ టెస్టులు ఆడిన సమయంలో పలుమార్లు అశ్వీన్ అతడిని ఔట్ చేశాడు. ఇక ఇటీవలి జరిగిన టెస్టు సిరీస్ మొదటి టెస్టులో తగెనరైన్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో మనోడు ఈ అరుదైన రికార్డును తన పేరున లిఖించుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిపైనే కేబీసీలో ఏకంగా పాతిక లక్షల క్వశ్చన్ రావడం విశేషం.

Shocking Video: 'పైత్యం ఎక్కువైతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మరి'.. వధువు ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటో షూట్..!

Updated Date - 2023-08-27T07:48:09+05:30 IST