Cough: దగ్గు తగ్గడం లేదని ఆ ట్యాబ్లెట్స్ వాడారో..అసలుకే మోసం..ఎందుకో తెలుసా..!
ABN , First Publish Date - 2023-03-06T08:51:21+05:30 IST
కొందరిలో దగ్గు(Cough), జలుబు వచ్చిపోతుంటాయి. కానీ మరికొందరిలో జలుబు పోయినా దగ్గు వస్తూనే ఉంటుంది. ఎన్ని ట్యాబ్లెట్లు, సిరప్లు తాగిన
కొందరిలో దగ్గు(Cough), జలుబు వచ్చిపోతుంటాయి. కానీ మరికొందరిలో జలుబు పోయినా దగ్గు వస్తూనే ఉంటుంది. ఎన్ని ట్యాబ్లెట్లు, సిరప్లు తాగిన ఫలితం ఉండదు. నెల నుంచి రెండు, మూడు నెలలు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే దానికి కారణమేంటో శాస్త్రవేత్తలు(Scientists)కనుగొన్నారు. రెండు, మూడు నెలలుగా చాలా మందిలో ఎడతెగని తగ్గుతో పాటు జ్వరం కూడా కనిపిస్తుండటానికి కారణం ఎన్ఫ్లెంజా ఏ వైరస్(Influenza) (A virus)లోని అని H3, N2 ఉప రకమేనని భారత వైద్య పరిశోధన మండలి(Indian Council of Medical Research) చెప్పింది. ఇతర ఉపరకాల కంటే.. దీని కారణంగానే ఆస్పత్రిలో చేరడం ఎక్కువ అవుతోందని చెప్పింది. దీని బారిన పడకుండా జాగ్రత్తలు కూడా చెప్పింది. దగ్గు, జలుబు, వికారం వంటి కేసుల్లో విచక్షణారహితంగా యాంటిబాటిక్స్(Antibiotics) వాడొద్దని భారతీ వైద్యుల సంఘం సూచించింది.
ఈ ఇన్ఫెక్షన్(Infection) సాధరణంగా 5 నుంచి 7 రోజులు ఉంటుంది. మూడ్రోజులలో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్లలోపు వారు.. 50 ఏళ్లు పై బడిన వారు ఈ ఇన్ఫెక్షన్ గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాయుకాలుష్యం(air pollution) కూడా కేసుల పెరుగుదలకు కారణమని చెబుతోంది. ఈ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులకు యాంటిబాటిక్స్ ఇవ్వకుండా.. రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు(Doctors) సూచించింది. ప్రస్తుతం దగ్గు, జలుబు లాంటి వాటికి అజుత్రిమైసిన్(Azutrimycin)..ఎమోక్సివ్(Emoxiv) లావ్ లాంటి యాంటిబాటిక్స్ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది యాంటిబాటిక్స్కు నిరోధకతకు దారితీస్తోంది. ఇలా వాడితే.. అవసరమైన సందర్భాల్లో అవి పని చేయకపోవచ్చు ఐఎమ్ఏ(IMA) ఓ ప్రకటనలో హెచ్చరించింది.
అతిసార, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే.. అమాక్సిసిలన్(Amoxicillin), నారాప్లాక్ససిన్(Narafloxacin) వంటి..యాంటిబాటిక్స్ను విపరీతంగా వాడుతున్నారని తెలిపింది. కోవిడ్(Covid) సమయంలో అజిత్ర్రో మైసిన్(Azithromycin), ఐవర్ మెక్టిన్(Ivor Mectin)లను విస్తతృంగా వినియోగించారు. ఇదీ కూడా యాంటిబాటిక్ నిరోధకతకు దారి తీసింది. రోగులకు యాంటిబాటిక్ సూచించే ముందు అది బాక్టరీయా ఇన్ఫెక్షన్ హా.. కాదా అని నిర్ధారించుకోవడం అవసరమని ఐఎమ్ఏ(IMA) సూచించింది. అన్నింటికి యాంటిబాటిక్స్ విచ్చలవిడిగా వాడితే అసలు మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహాతో వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.