Chapati & rice: మీకు భోజనంలో అన్నంతోపాటు చపాతీ తినే అలవాటుందా?? దీనివల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-06-11T16:10:30+05:30 IST

అన్నంతోపాటు చపాతీ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సంతోషపడేవారికి బ్యాడ్ న్యూస్. ఈ రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యం బాగవ్వడం కంటే..

Chapati & rice: మీకు భోజనంలో అన్నంతోపాటు చపాతీ తినే అలవాటుందా?? దీనివల్ల  ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అయితే చాలా మంది భోజనంలో అన్నంతో పాటు చపాతీ కూడా తింటూంటారు. డైటింగ్ చేసేవారు రాత్రిపూట చపాతీలు తినాలనే రూల్ పెట్టుకున్నా కడుపునిండినట్టు ఉండదు అనే సాకుతో కాస్తో కూస్తో అన్నం కడుపులోకి తోసేస్తారు.ఇంట్లోనే కాదు క్యాంటీన్ లలోనూ, హోటల్స్ లోనూ, పిజీ లలోనూ ఫుడ్ మెనూ ఎక్కువ భాగం ఇలానే ఉంటోంది. ఇలా అన్నంతోపాటు చపాతీ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సంతోషపడేవారికి బ్యాడ్ న్యూస్. ఈ రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యం బాగవ్వడం కంటే చెడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంతకూ ఈ రెండూ ఒకే సమయంలో తింటే ఏమవుతుందంటే..

అన్నం తింటే బరువు పెరుగుతారు అనే కారణంతో చాలామంది చపాతీ తినడానికి మొగ్గుచూపుతారు. కానీ చాలా చోట్ల కాసింత అన్నం ఓ చపాతీ అంటూ ఓ ఫుడ్ మెనూ ఫాలో అవుతూ ఉంటారు. అన్నంలో ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్(rice had more carbohydrates) ఎక్కువగా ఉంటాయి. అన్నంతో పాటు చపాతీ(rice eating with chapati) కూడా తింటే ఆ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ పెరుగురుతుంది(carbohydrate content increase). పైగా ఈ రెండింటిలో ఉన్న పోషకాలు వేరువేరు వర్గాలకు చెందినవి. ఈ కారణంగా రెండూ తినకూడదు. మరీ ముఖ్యంగా రాత్రి పూట ఈ రెండూ తినడం వల్ల బరువు తొందరగా పెరుగుతారు. ఇది ఉబకాయానికి కారణం అవుతుంది.

Viral Video: మొబైల్ మాయలో పడిన ఓ తల్లి చేసిన నిర్వాకం.. జరిగిందేంటో తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..


చపాతీ, అన్నం కలిపి తినడం వల్ల వచ్చే సమస్యలు..

చపాతీలు, అన్నం ఒకే సమయంలో తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బ తింటుంది(digest system problem). ఈ రెండింటిలో అన్నం తొందరగా జీర్ణమవుతుంది. చపాతీ జీర్ణం కావడానికి ఆలస్యమవుతుంది. ఇప్పట్లో చపాతీకి ఉపయోగిస్తున్న పిండి కూడా చాలా వరకు శుద్ది చేసినదే ఉంటోంది. ఈ కారణంగా చపాతీ జీర్ణం కావడం చాలా ఆలస్యమవుతుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు చాలా ఈజీగా వస్తాయి. ఈ రెండు తినాలని ఉంటే రెండింటికి మధ్య రెండు నుండి మూడు గంటల వ్యవధి తీసుకోవాలి.

రాత్రిపూట అన్నం, చపాతీ రెండూ(chapati, rice eating at night) తింటే నిద్రపట్టడంలో సమస్యలు వస్తాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా(high glycemic index) ఉండటం వల్ల కడుపు బరువుగా మారుతుంది. అంతేకాదు శరీరం కొద్దిపాటి నీరసానికి లోనవడం కూడా గమనించవచ్చు.

చపాతీ, అన్నం రెండింటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి(మcorbohydrates cause to pimples). వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ కార్బోహైడ్రైట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మొటిమలు ఎక్కువగా వస్తాయి. గ్లైసెమిక్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చెక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, హార్మోన్ అసమతుల్యంhormone imbalance) అవ్వడానికి కారణం అవుతాయి. ఈ కారణంగా మొటిమలు వస్తాయి.

షుగర్ ఉన్నవారు ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు. అలాగే కేవలం చపాతీ లేదా కేవలం అన్నం మాత్రమే తినేటప్పుడు కూరల కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది.

Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..


Updated Date - 2023-06-11T16:14:16+05:30 IST