Viral video: వధువు ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వివాహ వేదికపై రోలర్ స్కేట్స్‌తో డ్యాన్స్.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-06-19T20:27:34+05:30 IST
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర అంశాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర అంశాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక, వివాహ వేదికపై వధూవరులు చేసే డ్యాన్స్ (Bride dance Videos)కు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వధువు తన అద్భుత ట్యాలెంట్‌తో పెళ్లికి వచ్చిన అతిథులను మాత్రమే కాదు.. సోషల్ మీడియా జనాలను కూడా ఫిదా చేసింది.
allaboutdance.official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో పొడవాటి తెల్ల లెహంగా ధరించిన వధువు (Bride) వేదికపై డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సినిమా ``బార్ బార్ దేఖో`` సినిమాలోని సౌ ఆస్మాన్ పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఆమె రోలర్ స్కేట్స్ (Roller skates) ధరించి ఆ పాటకు చిందులేయడం విశేషం. దాంతో ఆ వధువు ప్రతిభకు అందరూ అవాక్కయ్యారు. ఆమె ట్యాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: ఫొటో కోసం ముద్దు పెట్టుకోమంటే నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయిన వధూవరులు.. ఫొటోగ్రాఫర్ పరిస్థితి ఏంటంటే..
ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 17 లక్షల మంది వీక్షించారు. దాదాపు 15 కేజీల బరువు ఉన్న లెహంగా వేసుకున్న వధువు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె ప్రదర్శనను అతిథులు చప్పట్లతో ప్రశంసించారు. అద్భుతంగా డ్యాన్స్ చేసిన వధువుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.