Bill Gates Dating: పౌలాహర్డ్‌తో బిల్ గేట్స్ ప్రేమాయణం...డేటింగ్

ABN , First Publish Date - 2023-02-09T11:07:27+05:30 IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు...

Bill Gates Dating: పౌలాహర్డ్‌తో బిల్ గేట్స్ ప్రేమాయణం...డేటింగ్
Bill Gates Paula Hurd Dating

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.బిల్ గేట్స్ దాదాపు 30 సంవత్సరాల వివాహ జీవితం అనంతరం తన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. పౌలాహర్డ్ అనే మహిళతో బిల్ గేట్స్ ప్రేమలో పడ్డాడని సమాచారం.

వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.(Bill Gates)బిల్ గేట్స్ దాదాపు 30 సంవత్సరాల వివాహ జీవితం అనంతరం తన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. పౌలాహర్డ్ అనే మహిళతో బిల్ గేట్స్ ప్రేమలో పడ్డాడని సమాచారం.(Bill Gates Dating) బిల్ గేట్స్ మనసు దోచుకున్న పౌలాహర్డ్ ఒరాకిల్ సీఈఓ మార్క్ షర్డ్ మాజీ భార్య.(Bill Gates Has Found Love Again) 2019వ సంవత్సరంలో మార్క్ హర్డ్ మరణించడంతో పౌలా హర్డ్ ఒంటరి అయ్యారు.

ఇది కూడా చదవండి : Vande Bharat Express: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త

హర్డ్ భర్త క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత 2019 అక్టోబరులో 62 సంవత్సరాల వయస్సులో మరణించారు. పౌలా హర్డ్ ఈవెంట్ ప్లానరుగా, టెక్ ఎగ్జిక్యూటివ్ గా, సామాజిక సేవకురాలిగా పనిచేస్తున్నారు. పౌలా,మార్క్ దంపతులకు కాథరిన్, కెల్లీలనే ఇద్దరు కుమార్తెలున్నారు.67 ఏళ్ల బిల్ గేట్స్ అరవై ఏళ్ల పౌలా హర్డ్ అనే మహిళతో ప్రేమాయణం(Relationship) సాగిస్తున్నాడని తాజాగా వెల్లడైంది. గత కొంత కాలంగా డేటింగులో (Dating)ఉన్న ఈ బిల్, పౌలాల జంట టెన్నిస్ అంటే మక్కువతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో( Australian Open) వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగారు.

ఇది కూడా చదవండి : Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు

వృద్ధ్యాప్యంలో డేటింగులో ఉన్న ఈ జంట పక్కపక్కనే కూర్చొని ఆటను తిలకించారు. లేటు వయసులో బిల్ పౌలాల జంట శృంగార సంబంధంలో ఉన్నారని అంతరంగీకులు చెపుతున్నారు. బిల్ గేట్స్, పౌలాల మధ్య బంధం విడదీయరానిదని వీరి స్నేహితుడు వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్నా తమ ఫౌండేషన్ అయిన బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను కలిసి కొనసాగిస్తామని బిల్ గేట్స్, మిలిండాలు గతంలో ప్రకటించారు.మొత్తంమీద లేటు వయసులో బిల్ గేట్స్ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-02-09T11:33:21+05:30 IST